iDreamPost
android-app
ios-app

ఫలితాలు వచ్చేశాయి.. ఇంతకీ పవిత్ర లోకేష్ పరిస్థితి ఏంటంటే..?

  • Author ajaykrishna Published - 01:41 PM, Sat - 5 August 23
  • Author ajaykrishna Published - 01:41 PM, Sat - 5 August 23
ఫలితాలు వచ్చేశాయి.. ఇంతకీ పవిత్ర లోకేష్ పరిస్థితి ఏంటంటే..?

ఇండస్ట్రీలో పవిత్ర లోకేష్ పేరు వినిపిస్తే చాలు.. వెంటనే సీనియర్ నటుడు నరేష్ కూడా గుర్తొస్తాడు. ఎందుకంటే.. ఈ జంటకు ప్రేక్షకులలో, సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అలాంటిది మరి. కొన్నాళ్ళుగా నరేష్ తన మూడో భార్య రమ్య రఘుపతికి దూరంగా ఉంటూ.. పవిత్ర లోకేష్ కి దగ్గరైన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కొంతకాలంగా కలిసి జీవిస్తున్నారు. వీరి పేర్లు కనిపిస్తే చాలు సోషల్ మీడియా అంతా ఊగిపోతుంది. ఓవైపు ఫ్యామిలీ గొడవలు సాగుతున్నప్పటికి.. ఈ జంట తమ పని తాము చేసుకుంటూ ట్రోల్స్ ఎదురైనా దూసుకుపోతున్నారు. ఇక తాజాగా పవిత్రకు సంబంధించి ఓ న్యూస్ వైరల్ గా మారింది.

ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న తన కోరికను పూర్తి చేసేసిందట పవిత్ర. మరి ఇంతకీ ఆ కోరిక ఏంటనే వివరాల్లోకి వెళ్తే.. ఇటీవలే కన్నడ యూనివర్సిటీ నుండి పీహెచ్‌డీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. అందులో 260 మంది ఈ ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అవ్వగా.. వారిలో పవిత్ర లోకేష్ కూడా పాస్ అయ్యిందని సమాచారం. అదేంటి.. కన్నడ యూనివర్సిటీ ఎగ్జామ్ లో పవిత్ర పాస్ అవ్వడం ఏంటని మీకు అనుమానం రావచ్చు. కానీ.. అసలు విషయం ఏంటంటే.. పవిత్రకు తన మాతృభాష కన్నడలో పీహెచ్‌డీ చేయాలని కోరిక ఉండేదని గతంలో చెప్తూ వచ్చింది. ఆ కోరిక ప్రకారం.. తాను భాషా నికాయ ఆధ్వర్యంలో బెల్గాం ఎక్స్‌ టెన్షన్ సెంటర్‌ లో పరిశోధన చేయడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసింది.

ఈ ఏడాది మే నెలలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయగా.. ఆమెకు తోడుగా నరేష్ కూడా వెళ్లినట్లు తెలుస్తుంది. ఇక తాజాగా ఫలితాలలో పాస్ అవ్వడంతో.. పవిత్ర ఆనందానికి హద్దులు లేకుండా పోయిందట. పవిత్రకు యూనివర్సిటీలో ఖచ్చితంగా సీట్ వస్తుందని నమ్మకంగా ఉందట. ఇదిలా ఉండగా.. కన్నడ విశ్వవిద్యాలయంలో సైన్స్, భాష, సోషల్ సైన్స్, లలిత ఆర్ట్.. అంటూ వివిధ విభాగాల ఇన్‌స్టిట్యూట్స్ లో రీసెర్చ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. అందులో ఈసారి పీహెచ్‌డీ చేసేందుకు 981 మంది ఎంట్రన్స్‌ పరీక్ష రాస్తే.. కేవలం 259 మంది మాత్రమే పాస్ అయినట్లు యూనివర్సిటీ ఛాన్సలర్ సుబ్బన్న రాయ్‌ తెలిపారు. ఇప్పుడు ఆ సీట్లను మెరిట్ ఆధారంగా కేటాయించనున్నట్లు తెలుస్తుంది. మరి పవిత్ర లోకేష్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

ఇదీ చదవండి: ఒక్క హిట్ తో.. ఫేవరేట్ హీరో సినిమాలో ఛాన్స్! వైష్ణవి లక్కే లక్కు!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbankobet girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio