ఒక్క హిట్ తో.. ఫేవరేట్ హీరో సినిమాలో ఛాన్స్! వైష్ణవి లక్కే లక్కు!

ఒక్క హిట్ తో.. ఫేవరేట్ హీరో సినిమాలో ఛాన్స్! వైష్ణవి లక్కే లక్కు!

  • Author ajaykrishna Updated - 01:05 PM, Sat - 5 August 23
  • Author ajaykrishna Updated - 01:05 PM, Sat - 5 August 23
ఒక్క హిట్ తో.. ఫేవరేట్ హీరో సినిమాలో ఛాన్స్! వైష్ణవి లక్కే లక్కు!

హీరోయిన్స్ కెరీర్ లో ఎప్పుడు అద్భుతాలు జరుగుతాయో కనీసం వారు కూడా ఊహించలేరు. ప్రస్తుతం యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య కెరీర్ లో అలాంటి అద్భుతమే జరిగిందని చెప్పాలి. డెబ్యూ మూవీనే బ్లాక్ బస్టర్ విజయం అందించేసరికి.. వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయట. షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ వెబ్ సిరీస్ లతో కెరీర్ స్టార్ట్ చేసిన వైష్ణవి.. రీసెంట్ గా బేబీ సినిమాతో హీరోయిన్ గా మారిన సంగతి తెలిసిందే. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ.. యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయింది. కట్ చేస్తే.. మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలకు సరిసమానంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టింది.

బేబీ సినిమాలో వైష్ణవి క్యారెక్టర్ కి గాను చాలా మంచి పేరు వచ్చింది. ఎంతలా అంటే.. సినిమాలో ఆ క్యారెక్టర్ ని చూసి బయటికి వచ్చాక పోస్టర్స్ పై దాడి చేసే రేంజ్ లో కనెక్ట్ అయ్యారు యూత్. అయితే.. బేబీ సినిమా సక్సెస్ అయినప్పుడు.. ఉస్తాద్, ఎనర్జిటిక్ హీరో రామ్ నుండి వైష్ణవికి విషెస్ తో పాటు ఫ్లవర్ బొకే అందిన విషయం తెలుసు కదా.. ఈ విషయాన్నీ స్వయంగా వైష్ణవి కూడా ట్విట్టర్ లో ఫోటోలు పెట్టి మరీ.. తన హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంది. అయితే.. ఇప్పుడు వైష్ణవి ఆనందం రెట్టింపు అయ్యే కబురు అందిందని సినీ వర్గాలలో టాక్ నడుస్తోంది. అదేంటంటే.. బేబీ హిట్ కి విష్ చేసిన రామ్.. తన కొత్త సినిమాలో వైష్ణవికి ఛాన్స్ ఇచ్చాడని సమాచారం.

రామ్ ప్రస్తుతం ఓవైపు మాస్ డైరెక్టర్ బోయపాటితో ‘స్కంద’ చేస్తూనే.. మరోవైపు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్’ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమాలో ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయ్యిందట. అయితే.. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని.. అందులో సెకండ్ హీరోయిన్ గా వైష్ణవికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ నిజమే అయినా.. మేకర్స్ నుండి ఆఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. కాగా.. ఈ విషయం తెలిసిన నెటిజన్స్.. వైష్ణవికి ఫేవరేట్ హీరో రామ్ అని చెప్పింది. అదిగాక ముందు బొకే పంపి విష్ చేశాడు. అప్పుడే అర్ధం చేసుకోవాల్సింది.. తన సినిమాలో ఛాన్స్ ఇస్తాడేమోనని అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. డబుల్ ఇస్మార్ట్ మూవీని వచ్చే ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మహాశివరాత్రికి రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి డబుల్ ఇస్మార్ట్ గురించి, వైష్ణవి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments