iDreamPost
android-app
ios-app

10 ఏళ్ల చిన్నవాడితో డేటింగ్ అంటూ వార్తలు.. కృతి సనన్‌ ఏమన్నదంటే?

  • Published Aug 13, 2024 | 2:51 PM Updated Updated Aug 13, 2024 | 2:52 PM

Kriti Sanon: సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి న్యూస్ క్షణాల్లో వైరల్ అవుతుంది. తమపై వస్తున్న రూమర్లు చూసి సెలబ్రెటీలు వాటిపై క్లారిటీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తనపై వస్తున్న రూమర్లపై నటి కృతి సనన్ స్పందించింది.

Kriti Sanon: సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి న్యూస్ క్షణాల్లో వైరల్ అవుతుంది. తమపై వస్తున్న రూమర్లు చూసి సెలబ్రెటీలు వాటిపై క్లారిటీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తనపై వస్తున్న రూమర్లపై నటి కృతి సనన్ స్పందించింది.

  • Published Aug 13, 2024 | 2:51 PMUpdated Aug 13, 2024 | 2:52 PM
10 ఏళ్ల  చిన్నవాడితో డేటింగ్ అంటూ వార్తలు.. కృతి సనన్‌ ఏమన్నదంటే?

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. 2014లో సుకుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘1 నేనొక్కడినే’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఈ మూవీలో కృతి సనన్ తన అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో గ్లామర్ తరహా పాత్రలతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఓం రావత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన‘ఆదిపురుష్’ మూవీలో సీతగా నటించింది మంచి మార్కులు కొట్టింది. ఈ మధ్య సోషల్ మీడియాలో కృతి సనన్ కి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. తాజాగా తనపై వస్తున్న వార్తలపై కాస్త ఘాటుగానే స్పందించింది. వివరాల్లోకి వెళితే.

బాలీవుడ్ లోనే కాదు ఇతర భాషా చిత్రాల్లో కృతి సనన్ బిజీ హీరోయిన్ గా మారింది. పాపులారిటీ వస్తున్న సమయంలో నటీనటులపై రక రకాల రూమర్లు రావడం సహజం. ఇటీవల సోషల్ మీడియాలో నటి కృతి సనన్ కి సంబంధించిన వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. తనకన్నా 10 ఏళ్ల చిన్నవాడితో ఈ అమ్మడు డేటింగ్ చేస్తున్నట్లు ఆ వార్తల సారాంశం. యూకే‌కు చెందిన కబీర్ బహియాతో కృతి కొంత కాలంగా డేటింగ్ చేస్తుందని మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఆమె పుట్టిన రోజు వేడుకను కబీర్ తో కలిసి చేసుకున్నారని ఊహాగానాలు వినిపించాయి.వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేకాదు త్వరలో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆమె స్పందించింది.

‘సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నన్ను చాలా బాధించాయి. నా గురించి తప్పుడు సమాచారం రాయడం వల్ల నాతో పాటు నా కుటుంబం సభ్యులు కూడా ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి వార్తల వల్ల కీలక పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీడియా ద్వారా ఎలాంటి వార్తలైనా క్షణాల్లో జనాల్లోకి వెళ్తాయి. నాపై వచ్చిన వార్తలు చూసి నాకు ఎంతోమంది మెసేజ్‌లు పెడుతున్నారు. అవి చూస్తుంటే నాకు చికాకుగా ఉంది. 34 ఏళ్ల కృతి 10 ఏళ్లు చిన్నవాడైన వ్యక్తితో డేటింగ్’ అంటూ హెడ్డింగులు పెట్టి వార్తలు రావడంతో నిజా నిజాలు తెలుసుకోకుండా నన్ను అందరూ అపార్థం చేసుకుంటున్నారు. వాస్తవానికి అలాంటిది ఏమీ లేదు.. ఇలాంటి వార్తలు ఎలా పుట్టిస్తారో అర్థం కాదు. ఇలాంటి రూమర్స్ పుట్టించి అవతలవాళ్లు బాధపడుతుంటే ఎంజాయ్ చేయడం కొంతమందికి ఫ్యాషన్ అయ్యింది. మరికొందరు ట్రోలింగ్ చేయడం కామన్ అయ్యింది’అంటూ అసహనం వ్యక్తం చేసింది.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio