Venkateswarlu
Venkateswarlu
ప్రముఖ తమిళ నటి కల్యాణి గత కొన్నేళ్లుగా వెన్నెముక సంబంధిత సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా, ఆమెకు మరోసారి వెన్నెముక సంబంధిత సర్జరీ జరిగింది. ఈ సారి మేజర్ సర్జరీ జరగటంతో కొన్ని రోజుల పాటు ఆమె ఆస్పత్రికే పరిమితం అయ్యారు. తర్వాత కోలుకుని ఇంటికి వచ్చారు. ఇంటికి చేరుకున్న తర్వాత.. సర్జరీ కారణంగా తాను మానసికంగా, శారీరకంగా ఎదుర్కొన్న సమస్యలపై ఓ పోస్టు పెట్టారు. ఈ పోస్టు వైరల్‌గా మారింది. ఆ పోస్టును తప్పుగా అర్థం చేసుకున్న కొన్ని మీడియా సంస్థలు.. కల్యాణి ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా ఉందంటూ వార్తలు రాయటం మొదలెట్టాయి. ఇక, సోషల్ మీడియాలో అయితే, మార్ఫింగ్ ఫొటోలు వైరల్‌గా మారాయి.
కల్యాణి ఫొటో మార్ఫింగ్ చేసి.. ఆస్పత్రిలో నర్సుల సాయంతో నడుస్తున్నట్లుగా సీన్‌ను క్రీయేట్ చేశారు. ఇక, ఈ తప్పుడు వార్తలపై కల్యాణి తాజాగా స్పందించారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ స్టోరీ పెట్టారు. ఆ స్టోరీలో.. ‘‘ సమయం 12 గంటలు అయింది. కొన్ని మీడియా సంస్థలు మిస్ కమ్యూనికేషన్ కారణంగా నాపై తప్పుడు వార్తలు రాస్తున్నాయి. ఆస్పత్రిలో ఉన్న ఓ మహిళ శరీరానికి నా తలను అంటించి మరీ న్యూస్ వైరల్ చేస్తున్నాయి. నేను ఆ పోస్టు పెట్టింది.. నా మానసిక పరిస్థితి గురించి చెప్పడానికి మాత్రమే.
సర్జరీ తర్వాత నా మానసిక స్థితి గురించి పోస్టు పెట్టాను. సర్జరీ తర్వాత ఇంటికే పరిమితం అయ్యాను. నేను బయటకు వెళ్లవచ్చు కానీ, కొంత ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఇంట్లోనే ఎక్కువ సేపు ఉండాల్సి వస్తోంది. దీంతో నా మానసిక పరిస్థితి కొంచెం ఇబ్బందుల్లో పడింది. నేను దాని గురించి చెబుతూ పోస్టు పెట్టాను. దాన్ని న్యూస్ ఛానల్స్ తప్పుగా రాస్తున్నాయి. మీరు ఆ వార్తల్ని అస్సలు నమ్మోద్దు’’ అంటూ క్లారిటీ ఇచ్చారు. మరో స్టోరీలో తన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. మరి, నటి కల్యాణి ఆరోగ్యంపై తప్పుడు వార్తలు రావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.