Kajal Aggarwal: మరోసారి తల్లి కాబోతున్న కాజల్! సినిమాలకు గుడ్ బై చెప్పినట్లేనా?

  • Author Soma Sekhar Published - 06:19 PM, Thu - 15 June 23
  • Author Soma Sekhar Published - 06:19 PM, Thu - 15 June 23
Kajal Aggarwal: మరోసారి తల్లి కాబోతున్న కాజల్! సినిమాలకు గుడ్ బై చెప్పినట్లేనా?

కాజల్ అగర్వాల్.. ‘లక్ష్మీకళ్యాణం’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా సక్సెస్ కావడంతో.. ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. దాంతో కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ.. తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఈ క్రమంలోనే తన స్నేహితుడు అయిన వ్యాపార వేత్త గౌతమ్ ను 2020లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఓ బాబు కూడా జన్మించాడు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో దూకుడుగా సినిమాలు చేస్తుంది ఈ చందమామ బ్యూటీ. అయితే తాజాగా కాజల్ రెండో సారి తల్లి కాబోతోంది అన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..

కాజల్ అగర్వాల్.. టాలీవుడ్ లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకుంది. తన నటన, అందంతో.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్ స్టేటస్ ను పొందినప్పుడే 2020లో బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు 2021లో బాబు కూడా జన్మించాడు. అయితే ప్రస్తుతం కాజల్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే? కాజల్ మరోసారి తల్లి కాబోతోంది అన్న న్యూస్. దాంతో సినిమాలకు కాజల్ గుడ్ బై చెప్పనుందా? అన్న డౌట్ అభిమానుల్లో నెలకొంది.

ఈ క్రమంలోనే ఈ వార్తలను తోసిపుచ్చింది కాజల్. తాను రెండోసారి తల్లి కాబోతున్నాను అన్న వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం కాజల్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో స్టార్ హీరోలతో నటిస్తూ.. దూసుకెళ్తోంది. ఇటు కమల్ హాసన్ తో ఇండియన్ 2, అటు బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమాల్లో నటిస్తోంది. వీటితోపాటుగా పలు వెబ్ సిరీస్ ల్లో కూడా నటించనున్నట్లు సమాచారం.

Show comments