iDreamPost
android-app
ios-app

ఏడేళ్ల ప్రేమ, పెళ్లైన తెల్లారే ఆస్తి కోసం వేధింపులు: నటి జయలలిత

ఏడేళ్ల ప్రేమ, పెళ్లైన తెల్లారే ఆస్తి కోసం వేధింపులు: నటి జయలలిత

సినిమా అనేది రంగుల ప్రపంచం. అందులో అన్ని ఎంతో అద్భుతంగా కనిపిస్తుంటాయి.  ఆ రంగుల ప్రపంచంలో ఎందరో  స్టార్లుగా రాణించారు. కానీ నిజ జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అలాంటి వారిలో సినీయర్ నటి జయలలిత ఒకరు. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.  ఎన్నో సినిమాల్లో నటించి.. మంచి నటిగా గుర్తింపు సంపాదించింది. రంగుల ప్రపంచంలో ఆమె రాణిగా వెలిగింది. కానీ నిజ జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. తన జీవితంలో జరిగిన ఎన్నో విషాదాలను చెప్పుకుని ఎమోషనలయ్యారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్ని తన వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చింది.

సినీయర్ నటి జయలలిత కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఓ డైరెక్టర్ ను ప్రేమించింది. ఇంట్లో వాళ్లను ఎదిరించి..మరీ ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసింది. కానీ పెళ్లి తరువాత ప్రియుడి నిజస్వరూపం బయటపడింది. ఆస్తి కోసమే తనను ప్రేమించినట్లు నటించాడని ఆమెకు అర్ధమైంది. అతడి హింస తట్టుకోలేక చివరకు విడాకులు తీసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంది. జయలలిత క్లాసికల్ డ్యాన్సర్. ఆమె ఐదో తరగతి రెండు సార్లు ఫెయిలైదంట. ఆమెపైనే కుటుంబం ఆధారపడి ఉండటంతో వచ్చిన ఆఫర్స్ ఒప్పుకుంటూ పోయింది.

ఆమె మాట్లాడుతూ..” నేను మలయాళ డైరెక్టర్ వినోద్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అయితే పెళ్లైన మరుసటి రోజు నుంచే ఆస్తి కోసం పోరు మొదలు పెట్టాడు. లేదంటే పిల్లల్ని కనమని వేధించాడు. డబ్బులు తీసుకురా.. లేదంటే యాసిడ్  పోస్తాని అత్తింటి వారు బెదిరించారు. అలా వారి వేధింపులు భరించలేక ఆరు నెలలకే విడాకులు తీసుకున్నాడు. ఇటీవలే అతడి ఓ ప్రమాదంలో కాలికి గాయమై.. పక్షవాత వచ్చింది. బెడ్ మీద నుంచి లేవలేని స్థితిలో ఉన్నాడు.

అతడి భార్య సరిగ్గా చూసుకోకపోవడంతో మందుల కోసం నెలకు రూ.5 వేలు పంపించాను. అలానే ఈ మధ్యకాలంలో నేను సంపాదించిన రూ.4 కోట్లు పోగొట్టుకున్నాను. రాఘవేంద్రరావు దగ్గర డ్రైవర్ గా  పని చేసే.. అనిల్ గణపతి రాజు అనే వ్యక్తి మోసం చేశాడు.  అమ్మా అమ్మా.. అని అడుక్కోవడంతో ఉన్నదంతా ఇచ్చేశాను. ఇలా ఉన్నదంతా పోయి ఇబ్బందులు పడ్డప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు మద్దతుగా రాలేదు” అని చెప్తూ  జయలలిత ఎమోషనలైంది. మరి..జయలలిత లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetpark giriştimebetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetMadridbetjojobetgrandpashabet girişJojobetjojobetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet giriş