Indraja: ఇంద్రజ కూతురిని చూశారా? టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమేనట!

ఇంద్రజ కూతురిని చూశారా? టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమేనట!

  • Author ajaykrishna Published - 10:44 AM, Fri - 25 August 23
  • Author ajaykrishna Published - 10:44 AM, Fri - 25 August 23
ఇంద్రజ కూతురిని చూశారా? టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమేనట!

ఇండస్ట్రీలో సీనియర్ నటినటుల వారసులు.. హీరోహీరోయిన్స్ గా ఎంటర్ అవుతుండటం చూస్తూనే ఉన్నాం. అలా వారసులు, వారసురాళ్లుగా ఎంట్రీ ఇచ్చి.. సక్సెస్ అయినవారిని కూడా చూశాం. ఇంకా చూస్తున్నాం. అయితే.. కొంతమంది సీనియర్ నటులు వారసులు ఉన్నప్పటికీ.. ఇండస్ట్రీలో పరిచయం చేయడానికి చాలా టైమ్ తీసుకుంటారు. ఇంకొందరు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా అయినా పరిచయం చేసేస్తారు. ఎందుకంటే.. అలాగైనా వాళ్ళు క్రేజ్ తెచ్చుకొని.. అదే క్రేజ్ తో పెద్దయ్యాక ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుందని. అయితే.. కొందరు మాత్రం అసలు పిల్లలను ఇండస్ట్రీ వైపు రాకుండా చూస్తారు. ఎందుకంటే.. ఏదైనా వారి ఇంటరెస్ట్ బట్టి ఉంటుంది.

ఇప్పుడు ఇండస్ట్రీలో మరో సెలబ్రిటీ కూతురు డెబ్యూకి రెడీ అవుతోందని టాక్ బలంగా వినిపిస్తుంది. ఆ సెలబ్రిటీ ఎవరో కాదు.. సీనియర్ నటి ఇంద్రజ. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. 90లలో హీరోయిన్ గా అందరు స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది. అప్పట్లోనే ఇండస్ట్రీని తన గ్లామర్, యాక్షన్ తో ఓ ఊపు ఊపేసింది. అయితే.. హీరోయిన్ గా ఫామ్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకొని.. సినిమాలకు దూరమైంది. పిల్లలు, ఫ్యామిలీ బాధ్యతలతో బిజీ లైఫ్ చూసింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు మళ్లీ రీఎంట్రీ ఇచ్చి.. తల్లి, అత్త క్యారెక్టర్స్ తో సినిమాలు కంటిన్యూ చేస్తోంది. మరోవైపు టీవీ షోలకు జడ్జిగా వ్యవహారిస్తూ.. అటు సినీ, ఇటు బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది ఇంద్రజ.

ఇక ప్రస్తుతం నటిగా.. టీవీ షోస్ జడ్జిగా బిజీ అయిన ఇంద్రజ.. క్లాసికల్ డాన్సర్ అని తెలిసిందే. తనకు సంగీతం, డాన్స్ చాలా ఇష్టమని పలుమార్లు చెప్పుకొచ్చింది. అయితే.. ఇప్పుడు ఇంద్రజ వారసురాలు సినీ ఎంట్రీకి టైమ్ అయినట్లు తెలుస్తోంది. ఇంద్రజకు కూతురు సారా ఉంది. ప్రస్తుతం సంగీతం నేర్చుకుంటుందట. ఇటీవల తన కూతురు గురించి ఓ సందర్బంలో మాట్లాడిన ఇంద్రజ.. తన కూతురుకు నటన కన్నా మ్యూజిక్ మీద ఎక్కువ ఇంటరెస్ట్ ఉందని.. ఫ్యూచర్ లో మ్యూజిక్ డైరెక్టర్ అవుతుందని చెప్పినట్లు సమాచారం. దీంతో తల్లి ఇంద్రజలాగే ఎంతో అందంగా ఉన్న సారా.. మ్యూజిక్ డైరెక్టర్ అవుతుందని విని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మరి ఫ్యూచర్ లో సారా ఎలాంటి స్టెప్ వేయనుందో చూడాలని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.

Show comments