P Krishna
బెంగుళూరు శివారులో హెబ్బగోడి జీఎం ఫౌం హౌజ్ లో మే 15న రేవ్ పార్టీ ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు కోర్టుకు చార్జ్ షీట్ సమర్పించారు.
బెంగుళూరు శివారులో హెబ్బగోడి జీఎం ఫౌం హౌజ్ లో మే 15న రేవ్ పార్టీ ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు కోర్టుకు చార్జ్ షీట్ సమర్పించారు.
P Krishna
ఈ ఏడాది మేలో బెంగళూరు సమీపంలోని ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీకి సంబంధించి తెలుగు నటి హేమతో పాటు మరో 87 మంది పేర్లతోకర్ణాటక పోలీసులు గురువారం ఛార్జ్ షీట్ సమర్పించారు. మే 20న ‘సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ’ థీమ్‌తో జరిగిన పార్టీలో సెలబ్రెటీలు, మోడల్స్, టెక్కీలు సహా దాదాపు 100 మంది హాజరైన పార్టీలో నటి హేమ మాదక ద్రవ్యాలు సేవించిందని బెంగళూరు రూరల్ అదనపు జిల్లా సెషన్స్ కోర్టుకు సమర్పించిన 1,086 పేజీల ఛార్జ్ షీట్ పేర్కొంది. చార్జ్ షీట్ పై నటి హేక కీలక వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే..
బెంగుళూరు డ్రగ్స్ కేసులో ప్రముఖ నటి హేమ పేరు మళ్లీ వెలుగులోకి వచ్చంది. ఇటీవల సంచలనం సృష్టించిన బెంగుళూరు రేవ్ పార్టీ ఘటనలో నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఆమెతో పాటు ఈ పార్టీలో పాల్గొన్న 79 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు బెంగుళూరు పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ మేరకు 1,086 పేజీల చార్జ్ షీట్ కోర్టుకు సమర్పించారు. ఇదిలా ఉంటే బెంగుళూరు డ్రగ్స్ కేసుకి సంబంధించి చార్జ్ షీట్ పై నటి హేమ స్పందించారు. పోలీసులు సమర్పించిన చార్జ్ షీట్ లో తన పేరు లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా నటి హేమ ఓ వీడియో రిలీజ్ చేస్తూ.. మీకు ఓ గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నా.. నా బ్లడ్ శాంపిల్స్ లో నెగిటీవ్ వచ్చినట్లు మా లాయర్ చెప్పారు. అంతేకాదు పోలీసులు సమర్పించిన చార్జ్ షీట్ లో ఈ విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలుస్తుంది. నా బ్లడ్ షాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు ఏమీ లేవు అని నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను. ఈ ఘటన తర్వాత నేను అదే విషయం చెబుతున్నా.. కానీ కొంతమంది నన్ను బ్లేమ్ చేస్తున్నారు. ఇప్పటికీ చెబుతున్న నేను ఏ టెస్టులకైనా రెడీ. ఇప్పుడు చార్జ్ షీట్ లో పోలీసులు అదే విషయాన్ని పేర్కొన్నారు, ఈ విషయం మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది…థ్యాంక్స్ చెబుతున్నాను’ అంటూ వీడియోలో మాట్లాడారు.