iDreamPost
android-app
ios-app

మనమేమన్న దేవుళ్లమా.. ఏ తప్పు చెయ్యకుండా ఉంటామా?: నటి హేమ

  • Published May 27, 2024 | 4:06 PM Updated Updated May 27, 2024 | 4:06 PM

Actress Hema: బెంగుళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్ హౌజ్ లో జరిగిన రేవ్ పార్టీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ రేవ్ పార్టీలో బడ బడా నేతలు, సినీ తారలు, మోడల్స్ పాల్గొన్నారు. రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నట్లు తెగ వార్తలు వస్తున్నాయి.

Actress Hema: బెంగుళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్ హౌజ్ లో జరిగిన రేవ్ పార్టీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ రేవ్ పార్టీలో బడ బడా నేతలు, సినీ తారలు, మోడల్స్ పాల్గొన్నారు. రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నట్లు తెగ వార్తలు వస్తున్నాయి.

మనమేమన్న దేవుళ్లమా.. ఏ తప్పు చెయ్యకుండా ఉంటామా?: నటి హేమ

దేశ వ్యాప్తంగా బెంగుళూరు రేవ్ పార్టీ పెను సంచనాలు సృష్టించింది. పుట్టిన రోజు వేడుక ముసుగులో బెంగుళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ఎ ఫామ్ హౌజ్ లో జరిగిన రేవ్ పార్టీ దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో సినీ, రాజకీయ రంగానికి చెందిన వారే కాదు..పలువురు మోడల్స్ హాజరయ్యారు. విషయం తెలుసుకున్న బెంగుళూరు పోలీసులు ఫామ్ హౌజ్ పై రైడ్ చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రేవ్ పార్టీ కీలక సూత్రదారి విజయవాడ వాసి లంకలపల్లి వాసు గా పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉంటే.. బెంగుళూరు రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమె మాత్రం తనకు ఏ సంబంధం లేదని వాదిస్తుంది. తాజాగా మనమేమన్న దేవుళ్లమా.. అంటూ కొత్త వీడియో రిలీజ్ చేసింది. వివరాల్లోకి వెళితే..

బెంగుళూరు రేవ్ పార్టీ కేసు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి హేమకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. హేమ తో పాటు 86 మందికి సంబంధించిన రక్త నమూనాల్లో డ్రగ్స్ షాంపిల్స్ ఉన్నట్లు తెలియడంతో ఈ చర్య తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం (మే27) న విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. నటి హేమ మాత్రం తనకు రేవ్ పార్టీతో సంబంధం లేదని వాదిస్తుంది.  ఇదిలా ఉంటే.. నటి హేమ తాజాగా మరో వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో హేమ లైవ్ లో తన ఫ్యాన్స్ తో మాట్లాడారు.

వైరల్ అవుతున్న వీడియోలో నటి హేమ మాట్లాడుతూ.. ‘  మనం ఏం దేవుళ్ళం కాదు.. ఒకవేళ తప్పు జరిగితే హార్ట్ ఫుల్ గా సారీ చెప్పొచ్చు.. అప్పుడు మనం ఫ్రెష్ గా ఉంటాం.. ఒక్క అబద్దం చెబితే దాన్ని కవర్ చేయడానికి వంద అబద్దాలు ఆడాలి. అందుకే 99.9 పర్సెంట్ అబద్దాలు ఆడకుండా ఉంటే మంచిది. అందుకే నేను చాలా హ్యాపీగా ఉంటాను’ అంటూ మాట్లాడింది. మరి ఆమె మాటల్లోని ఆంతర్యం ఏంటో అన్న విషయంపై నెటిజన్లు రక రకాలుగా చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే మొన్న సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ.. ఆమె ఆరోగ్యం బాగాలేదని, విపరీతమైన వైరల్ ఫీవర్ తో బాధపడుతన్న కారణంగా హాజరు కాలేకపోతున్నా అంటూ ఒక లేఖను పంపించింది.అయితే సీసీబీ పోలీసులు ఆ లేఖను తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.