iDreamPost
android-app
ios-app

టాలెంట్ చూసి అవకాశం ఇవ్వాలి.. ఇండస్ట్రీలో అడ్జస్ట్మెంట్ అడుగుతారు: టాలీవుడ్ హీరోయిన్

  • Published Apr 22, 2024 | 7:19 PM Updated Updated Apr 22, 2024 | 7:19 PM

Actress Gayatri Rema: ఇండస్ట్రీ ఏదైనా కూడా ఆరోపణలు, విమర్శలు ఉంటూనే ఉంటాయి. తాజాగా మరో నటి ఇండస్ట్రీలో అవకాశవాదులు ఉంటారంటూ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది.

Actress Gayatri Rema: ఇండస్ట్రీ ఏదైనా కూడా ఆరోపణలు, విమర్శలు ఉంటూనే ఉంటాయి. తాజాగా మరో నటి ఇండస్ట్రీలో అవకాశవాదులు ఉంటారంటూ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది.

  • Published Apr 22, 2024 | 7:19 PMUpdated Apr 22, 2024 | 7:19 PM
టాలెంట్ చూసి అవకాశం ఇవ్వాలి.. ఇండస్ట్రీలో అడ్జస్ట్మెంట్ అడుగుతారు: టాలీవుడ్ హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో రంగులు, ప్రశంసలు, అవకాశాలు మాత్రమే కాదు.. అవమానాలు, ఛీత్కారాలు, అవకాశవాదులు కూడా ఉండనే ఉంటారు. అదే విషయాన్ని ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు బాహాటంగానే చెప్పుకొచ్చారు. ఇప్పటికే అన్ని ఇండస్ట్రీలకు చెందిన కొందరు స్టార్లు ఈ కాస్టింగ్ కౌచ్, మీటూ అంటూ చాలా సందర్భాల్లో తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, హీరోలపై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. అవకాశం ఇస్తే నాకేంటి అంటూ చాలా మంది అడుగుతూ ఉంటారని చెప్తారు. తాజాగా మరో హీరోయిన్ ఈ జాబితాలోకి చేరింది. అడ్జస్ట్మెంట్ అడిగారంటూ సంచలన ఆరోపణలు చేసింది.

సినిమా ఇండస్ట్రీ అంటే కచ్చితంగా పూలు ఉంటాయి.. రాళ్లు కూడా ఉంటాయి. రాళ్ల దెబ్బలు తగలనిదే ఎవరూ పూల బాటలోకి అడుగుపెట్టలేదు అంటారు. తాజాగా మరో హీరోయిన్ ఇండస్ట్రీలో ఉండే చీకటి కోణాలపై ఆరోపణలు చేసింది. ఆమె మరెవరో కాదు హీరోయిన్ గాయత్రి రేమా. తాజాగా ఇచ్చి ఓ ఇంటర్వ్యూలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎక్కడైనా టాలెంట్ చూసి అవకాశాలు ఇవ్వాలి.. కానీ, ఇండస్ట్రీలో అడ్జస్ట్మెంట్ అడుగుతున్నారు అంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది. వాళ్లు అడిగిన దానికి ఓకే అంటేనే అవకాశం ఇస్తామంటున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఇలాంటి ఆరోపణలు రావడం కొత్తేం కాదు.. కానీ ఇంకా పరిస్థితులు అలాగే ఉన్నాయా అంటూ ప్రశ్నిస్తున్నారు.

Gayatri rema

గాయత్రి రేమా మాట్లాడుతూ.. “బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ఇప్పటికీ ముద్దు సీన్ కి ఓకే చెప్పరు. హాలీవుడ్ కి వెళ్లినా ప్రియాంక చోప్రా ఒంటిమీద దుస్తులు లేకుండా నటించేందుకు అంగీకరించదు. కానీ, మేము మాత్రం చెప్పిందల్లా ఎందుకు వినాలి?” అంటూ గాయత్రి రేమా ప్రశ్నించింది. అలాగే తనకు ఒకసారి సినిమా సెట్స్ లో ఎదురైన ఒక అవమానం గురించి చెప్పుకొచ్చింది. పిరియడ్స్ ప్రస్తావన వచ్చినప్పుడు తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితిని వివరించింది. ఒక హీరోయిన్ తల్లి తనకు చేసిన అవమానం గురించి వివరించింది. నెలసరి అంటే సాటి ఆడది అర్థం చేసుకోకపోగా అవమానించడం పట్ల అసహనం వ్యక్తం చేసింది.

“ఒకసారి ఎయిర్ పోర్ట్ దగ్గర షూటింగ్ చేస్తున్నాం. నాకు సడెన్ గా పిరియడ్స్ వచ్చాయి. ఆ సమయంలో ఆడవాళ్లకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. నేను మేనజర్ ని దగ్గర్లో ఎక్కడైనా వాష్ రూమ్స్ ఉన్నాయా అని అడిగాను. అతను లేవు అన్నాడు. మా ఇల్లు దగ్గర్లోనే ఉంది.. వెళ్లి వస్తాను అని చెప్పాను. అందుకు మేనేజర్ హీరోయిన్ కారీవ్యాన్ ఉంది. అందులోకి వెళ్లమని సూచించాడు. నేను అందులోనే ఛేంజ్ చేసుకున్నాను. అయితే హీరోయిన్ తల్లి కోపంగా నావైపున వచ్చి ఎందుకు లోపలికి వచ్చావ్ అంటూ అందరి ముందు నన్ను అవమానిచింది. సాటి ఆడదేగా.. అర్థం చేసుకుంటే బాగుండేది అనుకున్నాను” అంటూ గాయత్రి రేమా చెప్పుకొచ్చింది. ఈ అమ్మడు ఎక్కువగా తమిళ్ సినిమాలు చేస్తుంటుంది. తెలుగులో ప్రణవం మూవీ చేసింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss