iDreamPost
android-app
ios-app

శ్రీహరి కట్టిన తాళి మాత్రమే మిగిలింది! డిస్కో శాంతి కన్నీరు!

  • Author ajaykrishna Published - 03:01 PM, Sat - 19 August 23
  • Author ajaykrishna Published - 03:01 PM, Sat - 19 August 23
శ్రీహరి కట్టిన తాళి మాత్రమే మిగిలింది! డిస్కో శాంతి కన్నీరు!

దివంగత నటుడు శ్రీహరి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. కెరీర్ లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. తీరా నటుడుగా ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు ఆకస్మికంగా కన్నుమూశారు. దీంతో ఒక్కసారిగా శ్రీహరి ఫ్యామిలీలో విషాదం నెలకొంది. అప్పటినుండి ఆయన భార్య డిస్కో శాంతినే.. ఫ్యామిలీ, పిల్లలను చూసుకుంటోంది. డిస్కో శాంతి సౌత్ ఇండియాలో ఒకప్పుడు బిజీ ఆర్టిస్ట్. ముఖ్యంగా ఎన్నో స్పెషల్ సాంగ్స్ తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక కెరీర్ బిజీ ఉన్నప్పుడు శ్రీహరిని 1996లో పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక సినిమాలకు దూరంగా ఉంటోంది శాంతి.

శ్రీహరి చనిపోయి దాదాపు పదేళ్లు అవుతోంది. దీంతో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శాంతి.. శ్రీహరి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. అలాగే.. శ్రీహరి చనిపోయాక ఆస్తులన్నీ కోల్పోయి.. ఆర్థికంగా వెనకబడి పోయినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. “శ్రీహరి చనిపోయాక మా ఫ్యామిలీ చుట్టూ ఆర్థిక సమస్యలే చుట్టుముట్టాయి. ఆయన లేకపోవడంతో చాలామంది మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారు. అప్పులు తీర్చడానికి భూములు, కారును కూడా అమ్మాల్సి వచ్చింది. అవికూడా సరిపోక నా వద్ద ఉన్న నగలు కూడా తాకట్టు పెట్టి కట్టే పరిస్థితి ఏర్పడింది.

ఆఖరికి అన్ని కోల్పోయిన తర్వాత శ్రీహరి కట్టిన తాళి ఒక్కటే నా దగ్గర మిగిలి ఉంది. ఎంతో ఇష్టంగా కొనుక్కున్న కారును ఈఎంఐ కట్టలేదని బ్యాంకు వారు తీసుకెళ్లిపోయారు. ఒకవేళ అదే డబ్బు గానీ మా వద్ద ఉండి ఉంటే.. ఈ పాటికి నా కొడుకును ఫారెన్ పంపించి.. చదివించేదాన్ని.” అని భావోద్వేగానికి గురైంది డిస్కో శాంతి. శ్రీహరి ఉన్నప్పుడు ఇంటి చుట్టూ తిరిగిన వారంతా.. ఆయన మరణించాక ఒక్కరూ తమ వైపు చూడలేదని శాంతి చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. ఆ మధ్య శాంతి తన కొడుకును హీరోగా పరిచయం చేసింది. కానీ.. ఆ సినిమా నిరాశపరిచింది. ప్రస్తుతం తమకు ఆదాయం రెండు ఇళ్ల నుండి వస్తున్న అద్దె మాత్రమే అని శాంతి తెలిపింది. ప్రస్తుతం శాంతి మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş