iDreamPost
android-app
ios-app

నీవల్లే సినిమా ఫ్లాప్.. చచ్చిపో అన్నారు: నటి ఆవేదన

  • Published Oct 05, 2023 | 4:20 PM Updated Updated Oct 05, 2023 | 4:20 PM
  • Published Oct 05, 2023 | 4:20 PMUpdated Oct 05, 2023 | 4:20 PM
నీవల్లే సినిమా ఫ్లాప్.. చచ్చిపో అన్నారు: నటి ఆవేదన

సినీ ఇండస్ట్రీలో హిట్లు, ఫ్లాపులు అనేవి సర్వసాధారణం.  సినిమా హిట్ అయితే ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటారు. ఒకవేళ తమ అభిమాన హీరో సినిమా ఫ్లాప్ అయితే మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తుంటారు.  ఇలాంటి ట్రోలింగ్స్ ఎక్కువగా దర్శకుడు, హీరోయిన్లే ఎదుర్కొవాల్సి వస్తుంది. ఒక హీరోయిన్ వరుస ఫ్లాపులు ఎదుర్కొంటే ఐరన్ లెగ్ గా ముద్ర వేస్తుంటారు. ఇలాంటి చేదు అనుభవమే తనకు ఎదురైందని ఓ నటి ఆవేదన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సినీ సెలబ్రెటీలకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. ముఖ్యంగా సినిమా హిట్ టాక్ వస్తే మంచిదే.. ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం విపరీతమైన ట్రోలింగ్ చేస్తూ నానా యాగీ చేస్తుంటారు. చాలా వరకు సినిమా అపజయానికి హీరోయిన్ కారణం అంటూ నిందలు వేస్తుంటారు. అలాంటి చేదు అనుభవమే తనకు ఎదురైందని బాలీవుడ్ బ్యూటీ డైసీ షా ఆవేదన వ్యక్తం చేసింది. 2014లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘జయ హూ’ అట్టర్ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫ్లాప్ కి ముఖ్య కారణం నువ్వే అంటూ అప్పట్లో విపరీతమైన ట్రోలింగ్స్ చేశారని కన్నీరు పెట్టుకుంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డైసీ షా మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ నటించిన ఏక్ థా టైగర్ మూవీ సూపర్ హిట్ తర్వాత ‘జయ హూ’ పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.. దీంతో నాపై ఓ దుష్ప్రచారం మొదలైంది. ఈ సినిమా ఫ్లాప్ కి కారణం నువ్వే అంటూ నాపై ట్రోల్స్ వచ్చాయి. ఈ ఫ్లాప్ చూసిన తర్వాత నువ్వు ఇంకా బతికే ఉన్నావా.. చచ్చిపోవొచ్చుకదా అంటూ దారుణంగా కామెంట్స్ చేశారు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది’ అని కన్నీరు పెట్టుకున్నారు. తర్వాత డైసీ షా కన్నడ, తమిళ మూవీస్ లో నటించి మంచి విజయాలు అందుకున్నారు. బాలీవుడ్ లో హేట్ స్టోరీ3, రేస్ 3, మిస్టర్ ఆఫ్ ది టాటూ వంటి చిత్రాల్లో నటించింది.

 

View this post on Instagram

 

A post shared by Daisy (@shahdaisy)

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom