iDreamPost
android-app
ios-app

విడాకుల బాటలో కలర్స్ స్వాతి? క్లూ ఇచ్చేసిందా?

  • Author Soma Sekhar Published - 09:36 AM, Tue - 18 July 23
  • Author Soma Sekhar Published - 09:36 AM, Tue - 18 July 23
విడాకుల బాటలో కలర్స్ స్వాతి? క్లూ ఇచ్చేసిందా?

గత కొంతకాలంగా టాలీవుడ్ లో విడాకులు తీసుకునే సెలబ్రిటీల సంఖ్య పెరిగిపోతోంది. నాగచైతన్య-సమంత, నిహారిక-చైతన్య జంటలు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే బాటలో మరో హీరోయిన్ నడవబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు జోరుగా చెక్కర్లు కొడుతున్నాయి. కాగా.. రెండేళ్ల క్రితం కూడా ఈ హీరోయిన్ డైవర్స్ తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను అప్పుడు ఖండించింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా మరోసారి ఈ బ్యూటీ డైవర్స్ తీసుకోబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తకు బలం చేకూర్చే విధంగా ఈ హీరోయిన్ కూడా ఇన్ స్టా గ్రామ్ నుంచి తన భర్త ఫోటోలను తీసేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

కలర్స్ స్వాతి.. బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చింది ఈ బ్యూటీ. తన సరదా మాటలతో ప్రేక్షకులను మెప్పించి వారి హృదయాలను కొల్లగొట్టింది. తెలుగులోనే కాకుండా దక్షిణాది భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. తెలుగు లో ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ మూవీలో వెంకటేష్ మరదలిగా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత స్వామిరారా, కార్తికేయ లాంటి సూపర్ హిట్ సినిమాలతో మంచి ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది. అయితే గత కొద్ది కాలంగా తెలుగులో సినిమాలు చేయడం లేదు ఈ బ్యూటీ.

ఈ క్రమంలోనే కలర్స్ స్వాతికి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన భర్త వికాస్ తో కొద్దిరోజులుగా దూరంగా ఉంటోందన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రచారానికి ప్రధాన కారణం స్వాతి తన భర్త ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ నుంచి తొలగించడమే అని చెప్పుకొస్తున్నారు నెటిజన్లు. గతంలో సమంత, నిహారిక కూడా ఇదే రీతిలో చేయడంతో.. స్వాతి-వికాస్ దంపతులు విడాకులు తీసుకోబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే రెండేళ్ల క్రితం కూడా ఇలాంటి వార్తలే రావడంతో స్వాతి స్పందించింది. తన భర్తతో దిగిన ఫోటోలను తీసేయలేదని, వాటిని ఆర్కివ్స్ లో దాచుకున్నానని చెబుతూ.. తన ఫోన్ లో ఉన్న వాటిని చూపించింది. అదీకాక ఆ ఫోటోలను చిన్న వీడియోగా తీసి అప్పట్లోనే పోస్ట్ చేసింది. దాంతో విడాకుల పుకార్లకు చెక్ పెట్టింది ఈ భామ.

తాజాగా మరోసారి స్వాతి విడాకులు తీసుకోబోతోంది అంటూ వార్తలు రావడం.. ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. కాగా.. 2018లో మలయాళీ ఫ్యామిలీకి చెందిన వికాస్ వాసును స్వాతి ప్రేమించి పెళ్లి చేసుకుంది. వికాస్ పైలట్ గా విధులు నిర్వర్తిస్తుండగా.. వీళ్లిద్దరూ థాయ్ లాండ్ లో సెటిల్ అయ్యారు. ప్రస్తుతం వికాస్ థాయ్ లాండ్ లో ఉంటున్నాడని, స్వాతి మాత్రం సినిమాలు చేసుకుంటూ.. హైదరాబాద్ లో ఉంటోందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ విడాకుల వార్తలకు చెక్ పెట్టాలంటే మరోసారి స్వాతి స్పందించాల్సిందే.

ఇదికూడా చదవండి: భారీ ఆఫర్‌కు రెడీ అయిన షారుఖ్‌.. విజయ్‌ సేతుపతి ఏమన్నాడంటే!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss