iDreamPost
android-app
ios-app

భారీ ఆఫర్‌కు రెడీ అయిన షారుఖ్‌.. విజయ్‌ సేతుపతి ఏమన్నాడంటే!

  • Published Jul 18, 2023 | 8:11 AM Updated Updated Jul 18, 2023 | 8:11 AM
  • Published Jul 18, 2023 | 8:11 AMUpdated Jul 18, 2023 | 8:11 AM
భారీ ఆఫర్‌కు రెడీ అయిన షారుఖ్‌.. విజయ్‌ సేతుపతి ఏమన్నాడంటే!

సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్దిమంది సూపర్‌ టాలెంటెడ్‌ హీరోల్లో విజయ్‌ సేతుపతి ఒకరు. ఆయన తన నటనతో టాలీవుడ్‌నుంచి బాలీవుడ్‌ వరకు జెండా పాతేశారు. బాలీవుడ్‌ హీరోలు కూడా విజయ్‌ సేతుపతితో సినిమాలు చేయటానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఆయన మాత్రం మంచి కథ, పాత్ర ఉందంటేనే సినిమాలు చేస్తున్నారు. ఒక్కోసారి తన ఇష్టమైన నటుల కోసం కథ వినకుండానే పాత్ర చేయటానికి ఓకే చెప్పేస్తున్నారు. హీరోగా.. విలన్‌గా.. ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక, విజయ్‌ సేతుపతి బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌.. అట్లీ కాంబోలో వస్తున్న ‘జవాన్‌’లో విలన్‌గా నటించారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతిని కచ్చితంగా నటింపజేయాలని షారుఖ్‌ అనుకున్నారంట. ఇందుకోసం ఏకంగా భారీ అమౌంట్‌ ఇవ్వటానికి సిద్ధపడ్డారంట. అది విలన్‌ పాత్ర కావటంతో ఏకంగా రూ. 25 కోట్ల రూపాయలు ఇవ్వటానికి సిద్ధపడ్డారంట.

ఒకవేళ అంత అమౌంట్‌ ఇవ్వటం గనుక నిజమే అయితే.. అంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్‌ తీసుకున్న విలన్‌లలో విజయ్‌ సేతుపతి దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంటారు. కానీ, విజయ్‌ సేతుపతి మాత్రం షారుఖ్‌తో ఎలాంటి రెమ్యూనరేషన్‌ లేకుండా నటిస్తానని అన్నారంట. ఇక, శివకార్తికేయన్‌ హీరోగా నటించిన ‘మావీరన్‌’ సినిమా విషయంలోనూ విజయ్‌ సేతుపతి గొప్ప మనసు చాటుకున్నారు. ఈ సినిమాకు గొంతు అరువిచ్చిన ఆయన.. ఇందుకోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదంట. మరి, విజయ్‌ సేతుపతి మంచి మనసుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss