iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి మృతి!

  • Published Feb 01, 2024 | 2:52 PM Updated Updated Feb 01, 2024 | 2:52 PM

ఈ మద్య వరుసగా సినీ ఇండస్ట్రీలో విషాదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రముఖ నటీనటులు కన్నుమూయడంతో అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది.

ఈ మద్య వరుసగా సినీ ఇండస్ట్రీలో విషాదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రముఖ నటీనటులు కన్నుమూయడంతో అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది.

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి మృతి!

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఒకరి తర్వాత ఒకరు సెలబ్రెటీలు కన్నుమూస్తున్నారు. నెలల వ్యవధిలోనే నటీనటులు, దర్శక, నిర్మాతలు, ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు చనిపోయారు. వయోభారం, అనారోగ్యం, హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాలు ఇలా ఎన్నో కారణాల వల్ల సెలబ్రెటీలు కన్నుమూస్తున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. వారిని అభిమానించే అభిమానులు శోకసంద్రంలో మునిగిపోతున్నారు. ఈ ఏడాది హాలీవుడ్ విషాదాల పర్వం కొనసాగుతోంది. ప్రముఖ బ్రిటీష్ నటుడు బ్యాట్ మ్యాన్ మూవీ ఫేమ్ టామ్ విల్కిసన్సన్ కన్నుమూసిన విషాదం నుంచి కోలుకోక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

హలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ నటి చితా రివేరా (91) కన్నుమూశారు.   వాషింగ్టన్ లో 1933, జనవరి 23న ప్యూర్టో రికన్, స్కాటిష్ దంపతులకు జన్మించింది చితా రివేరా. వీరు ఆఫ్రికన్-అమెరికన్ సంతతికి చెందినవారు. 1957లో తన సహనటుడు టోనీ మోర్డెంటేను వివాహం చేసుకుంది. కొంతకాలంగా న్యూయార్క్ సిటీలో అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసినట్లు ఆమె కుమార్తె లిసా మోర్డెంటే ఒక ప్రకటనలో తెలిపింది. చితా రివేరా నటిగానే కాకుండా మంచి సింగర్, డ్యాన్సర్ గా పేరు తెచ్చుకున్నారు. రివెరా 1986లో “జెర్రీస్ గర్ల్స్”లో నటిస్తున్నప్పుడు న్యూయార్క్‌లో జరిగిన కారు ప్రమాదంలో కాలుకు తీవ్ర గాయం అయ్యింది.. దీంతో  ఆమె కెరీర్‌కు చాలా గ్యాప్ వచ్చింది.

ఈ క్రమంలోనే  చితా రివేరా పలు శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది. దాదాపు ఏడు దశాబ్దాల పాటు సాగిన కెరీర్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.  2018లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ కోసం ప్రత్యేక టోనీని కూడా అందుకుంది.  నటిగానే కాకుండా వాల్ట్ డిస్నీ వరల్డ్‌లోని డిస్నీ క్యాండిల్‌లైట్ ప్రోసెషనల్‌లో చితా రివేరా పలుమార్లు హూస్ట్ గా వ్యవహరించారు. 2021,2022 సీజన్ లో చివరిగా ఆమె వ్యాఖ్యాతగా కనిపించింది. 2002లో ప్రతిష్టాత్మకమైన కెన్నెడీ సెంటర్ ఆనర్‌ను అందుకున్న మొదటి మహిళగా చితా రివేరా సృష్టించింది. ఆమె 2009లో ప్రెసిడెంట్ బరాక్ ఒబామా నుండి ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం కూడా అందుకుంది. ‘వెస్ట్ సైడ్ స్టోరీ బ్రాడ్‌వే స్టార్ ఆమె కెరీర్ లో మంచి పేరు తెచ్చాయి.