iDreamPost
android-app
ios-app

భర్తతో విడిపోయిన స్టార్‌ హీరోయిన్‌.. ఇప్పుడు కూతురే జీవితం అంటూ పోస్ట్‌

  • Published May 09, 2024 | 9:44 AM Updated Updated May 09, 2024 | 9:44 AM

Actress Bhama: స్టార్‌ హీరోయిన్‌ ఒకరు భర్త నుంచి విడిపోయారు. సోషల్‌ మీడియా వేదికగా విడాకుల విషయాన్ని ప్రకటించారు. ఆవివరాలు..

Actress Bhama: స్టార్‌ హీరోయిన్‌ ఒకరు భర్త నుంచి విడిపోయారు. సోషల్‌ మీడియా వేదికగా విడాకుల విషయాన్ని ప్రకటించారు. ఆవివరాలు..

  • Published May 09, 2024 | 9:44 AMUpdated May 09, 2024 | 9:44 AM
భర్తతో విడిపోయిన స్టార్‌ హీరోయిన్‌.. ఇప్పుడు కూతురే జీవితం అంటూ పోస్ట్‌

భారతీయ సమాజంలో వివాహ బంధానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక్కసారి పెళ్లి బంధంలోకి ప్రవేశిస్తే.. ఇక జీవితాంతం దానికే కట్టుబడి ఉండాలని నమ్ముతారు. ఎన్ని సమస్యలు వచ్చినా సరే.. బంధాన్ని నిలుపుకోవాలనే భావిస్తారు. విడాకులు అంటే మహాపాపంగా చూస్తారు. మరీ ముఖ్యంగా ఆడవారు.. విడాకులు అంటే ఇప్పటికి కూడా వెనకడుగు వేస్తారు. పిల్లల సంరక్షణ, ఆర్థిక, సామాజిక భద్రత వంటి అంశాలు వారిని విడాకుల దిశగా ప్రోత్సాహించవు. ఓ రెండు దశాబ్దాల క్రితం వరకు మన దేశంలో విడాకులు అంటే చాలా విచిత్రంగా చూసేవారు. కానీ ఇప్పుడు అవి సర్వసాధారణం అయ్యాయి. నచ్చితే కలిసి ఉందాం.. లేదంటే నీ దారి నీది.. నా దారి నాది అనుకుంటున్నారు. సర్దుకుపోదాం అని ఆలోచించడం లేదు. ఇక మహిళలు కూడా విడాకుల విషయంల గతంలో మాదిరి భయపడటం లేదు.

ఇక మాములు వ్యక్తులతో పోలిస్తే.. సెలబ్రిటీల విషయంలో ఈ ప్రేమ, పెళ్లి, డైవర్స్‌, వంటి విషయాలు చాలా కామన్‌ అన్నట్లుగా ఉంటాయి. నచ్చితే రిలేషన్‌లో ఉంటారు. లేదంటే విడిపోతారు. నలుగురు ఏం అనుకుంటారు అన్న దాని గురించి వారు పెద్దగా పట్టించుకోరు. తమ జీవితం సంతోషంగా ఉందా లేదా అన్నదే వారికి ప్రాధాన్యత. ఈ క్రమంలో తాజాగా ఓ హీరోయిన్‌.. విడాకులు తీసుకుంది. భర్తతో విడిపోయినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ప్రస్తుతం తన కూతురే తన జీవితం అంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ చేసింది. ఇంతకు ఎవరా హీరోయిన్‌ అంటే..

మలయాళ హీరోయిన్‌ భామ భర్త నుంచి విడిపోయింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా స్వయంగా ఆమెనే ప్రకటించింది. ప్రస్తుతం తాను సింగిల్‌ మదర్‌ అని పేర్కింది. ఈమేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. ‘‘నేను ఇంత స్ట్రాంగ్‌ అని నాకు ఇంతవరకూ తెలీలేదు. సింగిల్‌ మదర్‌ అయిన తర్వాతే ఈ విషయం తెలిసొచ్చింది. ఇప్పుడు ధృడంగా నిలబడటమే నా ముందున్న ఏకైక ఛాయిస్‌. నా కూతురికి నేను.. నాకు నా కూతురు.. ప్రస్తుతం ఇదే మా జీవితం’’ అంటూ తన పాపతో ఆడుకుంటున్న ఫోటో పోస్ట్‌ చేసింది. ఇది చూసిన జనాలు నువ్వు చాలా ధైర్యవంతురాలివి.. మీ ఇద్దరూ ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము అని కామెంట్స్‌ చేస్తున్నారు.

మలయాళ హీరోయిన్‌ అయిన భామ.. 2020లో అరుణ్‌ జగదీశ్‌ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఇక ఈ దంపతులకు ఓ పాప ఉంది. గత కొంతకాలంగా భర్తతో ఉన్న ఫోటోలను షేర్‌ చేయడమే మానేసింది భామ. దాంతో వీరి విడాకులు గురించి అనుమానాలు తెర మీదకు వచ్చాయి. ఇంతలోనే తను భర్తతో విడిపోయినట్లు ఆమెనే స్వయంగా ప్రకటించింది. అందుకుగల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈమె తెలుగులో మంచివాడు అనే మూవీలో హీరోయిన్‌గా నటించింది.

 

View this post on Instagram

 

A post shared by Bhamaa (@bhamaa)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş