iDreamPost
android-app
ios-app

ఒక్క సినిమా రిలీజ్ కాలేదు.. అప్పుడే మూడో ఛాన్స్ కొట్టేసిన క్రేజీ బ్యూటీ!

  • Published Jun 11, 2024 | 12:02 PM Updated Updated Jun 11, 2024 | 12:02 PM

ఓ యంగ్ హీరోయిన్ తాను నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే క్రేజీ ఛాన్స్ లు కొట్టేస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది. ఆ హీరోయిన్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

ఓ యంగ్ హీరోయిన్ తాను నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే క్రేజీ ఛాన్స్ లు కొట్టేస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది. ఆ హీరోయిన్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

  • Published Jun 11, 2024 | 12:02 PMUpdated Jun 11, 2024 | 12:02 PM
ఒక్క సినిమా రిలీజ్ కాలేదు.. అప్పుడే మూడో ఛాన్స్ కొట్టేసిన క్రేజీ బ్యూటీ!

హీరోయిన్లకు ఇండస్ట్రీలో ఓ సౌలభ్యం ఉంది. ఒక్క సినిమా రిలీజ్ కాకముందే సదరు బ్యూటీలకు అవకాశాలు క్యూ కడుతూ ఉంటాయి. ఇక తమ తొలి సినిమా హిట్టైతే.. కెరీర్ ఓ రేంజ్ లోకి దూసుకెళ్తుంది. ఈ విషయం ఇప్పటికే శ్రీలీల, కృతిశెట్టి లతో నిజమైంది. ఇప్పుడు మరో యంగ్ హీరోయిన్ ఇదే రేంజ్ లో అవకాశాలను దక్కించుకుంటూ దూసుకెళ్తోన్నట్లు తెలుస్తోంది. ఆమె నటించిన ఒక్క సినిమా విడుదల కాకముందే.. ముచ్చటగా మూడో సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. మరి మరి ఆ బ్యూటీ ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

భాగ్యశ్రీ బోర్సే.. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ లో హీరోయిన్ గా నటిస్తోంది. డైరెక్టర్ హారిష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ చిత్రం ఇంకా రిలీజ్ కాకముందే.. భాగ్యశ్రీకి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో రాబోయే చిత్రంలో ఈ బ్యూటీని తీసుకున్నారు. ఇక ఇప్పుడు మరో క్రేజీ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ నెక్ట్స్ మూవీలో భాగ్యశ్రీని తీసుకోనున్నారని సమాచారం.

ప్రస్తుతం దుల్కర్ ‘లక్కీ భాస్కర్’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత చెరుకూరి సుధాకర్ బ్యానర్ లో ఓ మూవీ చేయనున్నాడు. ఆ సినిమాలోనే ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేయనున్నారని వినికిడి. ఇలా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే వరుసగా ఆఫర్లు ఈ బ్యూటీని వెతుక్కుంటూ వస్తున్నాయి. దాంతో ఇండస్ట్రీలో మరో శ్రీలీల, కృతిశెట్టిలా భాగ్యశ్రీ మారబోతుందా? అని సినీ పండితులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఒక్క మూవీ రిలీజ్ కాకముందే.. ఆఫర్లు కొట్టేస్తున్న ఈ ముద్దుగుమ్మపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbahsegel girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom