iDreamPost
android-app
ios-app

Anjali: ముద్దు సన్నివేశాల్లో నటించడంపై అంజలి షాకింగ్ కామెంట్స్!

  • Published Jan 16, 2024 | 8:05 PM Updated Updated Jan 16, 2024 | 8:05 PM

హీరోయిన్ అంజలి.. ముద్దు సన్నివేశాల్లో నటించడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ముద్దు సన్నివేశాలు, ఇంటిమేట్ సీన్లపై తన అభిప్రాయాన్ని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు అంజలి.

హీరోయిన్ అంజలి.. ముద్దు సన్నివేశాల్లో నటించడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ముద్దు సన్నివేశాలు, ఇంటిమేట్ సీన్లపై తన అభిప్రాయాన్ని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు అంజలి.

Anjali: ముద్దు సన్నివేశాల్లో నటించడంపై అంజలి షాకింగ్ కామెంట్స్!

సాధారణంగా హీరో, హీరోయిన్స్ పై రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి. కొన్ని వార్తలు పెళ్లి, డేటింగ్ లాంటి విషయాలపై వస్తే.. మరికొన్ని షూటింగ్స్ లో జరిగే ఇంటిమేట్ సీన్స్ గురించి ఉంటాయి. ఇక ఇలాంటి న్యూస్ పై సందర్భం వచ్చినప్పుడు లేదా ప్రత్యేక ఇంటర్వ్యూల్లో వెల్లడిస్తూ ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ అంజలి.. ముద్దు సన్నివేశాల్లో నటించడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ముద్దు సన్నివేశాలు, ఇంటిమేట్ సీన్లపై తన అభిప్రాయాన్ని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు అంజలి.

హీరోయిన్ అంజలి.. అచ్చ తెలుగు నటిగా ఇండస్ట్రీలో రాణిస్తోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక చాలా రోజుల తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముద్దు సీన్లపై, రొమాంటిక్ సీన్లపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. అంజలి మాట్లాడుతూ..”సినిమాల్లో కొన్ని ఇంటిమేట్ సిన్లలో నటించేటప్పుడు నా సహనటుడు ఏమనుకుంటాడోనని ఆందోళన కలుగుతుంది నాకు. అయితే ఇలాంటి సీన్లు సినిమాకు అవసరం కాబట్టి కాదనలేం. నాకు ఇష్టం లేకున్నా.. అసౌకర్యంగానే వాటిల్లో నటిస్తాను. ఇక నిజజీవితంలో ప్రేమికుల మధ్య ఉండే కెమిస్ట్రీకి.. సినిమాలో లవర్స్ మధ్య ఉండే కెమిస్ట్రీకి చాలా తేడా ఉంది. అందుకే నాకు ముద్దు సన్నివేశాల్లో నటించేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది” అంటూ చెప్పుకొచ్చింది అంజలి.

వీటీతో పాటుగా తన పెళ్లిపై వస్తున్న రూమర్లపై కూడా క్లారిటీ ఇచ్చింది అంజలి. గతంలో నాకూ, జర్నీ నటుడు జైకి మధ్య లవ్ ఉందని రాసుకొచ్చారని, ఆ తర్వాత అమెరికాకు చెందిన వ్యక్తితో పెళ్లి జరిగిందని వార్తలు రాశారు. ఆ వార్తల్లో నిజం లేదు. ఇక ఇలాంటి న్యూస్ చూడగానే నాకు తెలియకుండానే నా పెళ్లి చేస్తున్నారని నవ్వుకుంటూ ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది బ్యూటీ అంజలి. ఇక తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీలో కీలక పాత్ర చేస్తోంది అంజలి. ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్-శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీలోనూ మెరవనుంది ఈ బ్యూటీ. వీటితో పాటుగా సూపర్ హిట్ మూవీ అయిన గీతాంజలి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది.

 

View this post on Instagram

 

A post shared by Anjali (@yours_anjali)

Jojobet GirişmeritbetmeritbetholiganbetVirüsbetcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Giriş