Arjun Suravaram
Bahishkarana Web Series Review: హీరోయిన్‌గా చేస్తూనే అంజలి పలు చిత్రాల్లో ఇంపార్టెంట్ రోల్స్‌తో ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ ‘బహిష్కరణ'. ఈ వెబ్ సిరీస్ శుక్రవారం జులై 19న జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ కి వచ్చింది. మరీ ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..
Bahishkarana Web Series Review: హీరోయిన్‌గా చేస్తూనే అంజలి పలు చిత్రాల్లో ఇంపార్టెంట్ రోల్స్‌తో ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ ‘బహిష్కరణ'. ఈ వెబ్ సిరీస్ శుక్రవారం జులై 19న జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ కి వచ్చింది. మరీ ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..
Arjun Suravaram
హీరోయిన్ అంజలి గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు అమ్మాయి అయినప్పటికీ కోలీవుడ్ మెరిసింది. హీరోయిన్ గా చేస్తూనే పలు చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటించింది ఆకట్టుకుంటుంది. ఇటీవలే ఆమె ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. అలానే విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కీలక పాత్రలో నటించింది. తాజాగా అంజలి ‘బహిష్కరణ’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ జూలై 19 శుక్రవారం నుంచి జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
అంజలి ప్రధాన పాత్రలో నటించిన బహిష్కరణ వెబ్ సిరీస్ ను ముకేశ్ ప్రజాపతి డైరెక్ట్ చేయగా..ప్రశాంతి మలిశెట్టి నిర్మించారు. విలేజ్ రివేంజ్ డ్రామాగా ఈ సిరీస్ తెరెకెక్కింది. ఈ వెబ్ సిరీస్ మొత్తం ఆరు ఎపిసోడ్స్ గా ఉంటాయని మేకర్స్ ప్రకటించారు. ఇందులో పుష్ప అనే వేశ్యా క్యారెక్టర్ లో అంజలని కనిపిస్తోంది. అలానే రవీంద్ర విజయ్,శ్రీతేజ్,అనన్య నాగళ్ల,షణ్ముక్ వంటి పలురవురు ఇతర పాత్రల్లో కనిపించి సందడి చేశారు.
ఇక ఈ వెబ్ సిరీస్ ను రివ్యూగా చెప్పుకున్నాట్లు అయితే.. దర్శి, లక్ష్మితో పాటు సిరి పాత్రలను పరిచయం చేస్తూ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఇక తర్వాత శివయ్యపై దర్శి పగతో రగిలిపోతున్నట్లుగా చూపించి ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తించారు డైరెక్టర్. ఎంతో ఎగ్జైట్ గా ఉండే సన్నివేశం దగ్గర మొదటి ఎపిసోడ్‌ను దర్శకుడు ముగించాడు. అలానే సెకండ్ ఎపిసోడ్ నుంచి మొత్తం ఫ్లాష్ బ్యాక్ స్టోరీని చూపించారు.
గుంటూరు జిల్లాలోని పెద్దపల్లికి చెందిన శివయ్య (రవీంద్ర విజయ్) 25 ఏళ్లుగా సర్పంచ్ గా పనిచేస్తుంటారు. ఓ సీక్రెట్ స్టోరీ ఉన్న పుష్ప(అంజలి)అనే వేశ్య, శివయ్యకు ఉంపుడుగత్తెగా ఉంటుంది. ఇక శివయ్య దగ్గర పనిచేసే దర్శి (శ్రీతేజ్) పుష్పను ఎంతో గాఢంగా ప్రేమిస్తాడు. పుష్ప కూడా దర్శితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటుంది. వీరి ప్రేమ విషయం తెలిసిన శివయ్య.. దర్శి చూస్తుండగానే లక్ష్మీ (అనన్య నాగళ్ల) తో పెళ్లి అయ్యేలా చేస్తాడు. దీంతో తాను ఎంతో గాఢంగా ప్రేమించిన పుష్పా దూరంగా కావడంతో దర్శి మద్యానికి బానిస అవుతాడు.
అయితే పుప్ప, దర్శిల మధ్య ఉన్న్ సంబంధాన్ని అతడి భార్య లక్ష్మి గ్రహిస్తుంది. అనేక ప్రయత్నాలు చేసి..తన ప్రేమతో భర్తను తనవైపుకు తిప్పుకుంటుంది లక్ష్మి. అక్కడి నుంచి వారి కాపురం సంతోషంగా సాగుతోంది. ఇలాంటి హ్యాపీ సాగే టైంలోనే దర్శి ఓ రేప్ కమ్ మర్డర్ కేసులో జైలు పాలవుతాడు? మరి ఈ రేప్ కేసు లో దర్శి ఎలా చిక్కుకున్నాడు? ఎవరి ఇరికించారు? అలాగే శివయ్య చేసిన మోసాలకు పుష్ప ఎలా రివేంజ్ తీర్చుకుంది?, ఇక ఈ రేప్ కేసు నుంచి దర్శి బయట ఎలా పడ్డాడు? అన్నదే ఈ వెబ్‌సిరీస్ కథ. మొత్తంగా ఎంతో ఉత్కంఠంగా, ఆసక్తిగా ఈ వెబ్ సిరీస్ సాగింది. ఇంకా చూడని వారు ఎవరైనా ఉంటే.. జీ5 లో ఈ వెబ్ సిరీస్ ను చూసేయవచ్చు.