iDreamPost
android-app
ios-app

Manjummel Boys: మంజుమ్మల్ బాయ్స్ డైరెక్టర్‌పై నటి లైంగిక ఆరోపణలు..!

  • Published Mar 09, 2024 | 3:48 PM Updated Updated Mar 09, 2024 | 3:48 PM

Manjummel Boys.. ప్రస్తుతం మాలీవుడ్ ఇండస్ట్రీలో కోట్లు కుమ్మరిస్తున్న సర్వైకల్ థ్రిల్లర్ మూవీ మంజుమ్మల్ బాయ్స్. ఈ సినిమా విజయంతో ఆనందంలో ఉంది చిత్ర యూనిట్. అంతలో..

Manjummel Boys.. ప్రస్తుతం మాలీవుడ్ ఇండస్ట్రీలో కోట్లు కుమ్మరిస్తున్న సర్వైకల్ థ్రిల్లర్ మూవీ మంజుమ్మల్ బాయ్స్. ఈ సినిమా విజయంతో ఆనందంలో ఉంది చిత్ర యూనిట్. అంతలో..

  • Published Mar 09, 2024 | 3:48 PMUpdated Mar 09, 2024 | 3:48 PM
Manjummel Boys: మంజుమ్మల్ బాయ్స్ డైరెక్టర్‌పై నటి లైంగిక ఆరోపణలు..!

థ్రిల్లర్ మూవీస్ అందించడంలో మలయాళ ఇండస్ట్రీని కొట్టిన వాళ్లు లేరడనడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా వచ్చిన సర్వైకల్ థ్రిల్లర్ మంజుమ్మల్ బాయ్స్ మంచి హిట్ కొట్టడమే కాదూ రికార్డ్స్ బ్రేక్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్లకు పైగా కొల్లగొట్టింది. USలో 1 మిలియన్ డాలర్స్ అందుకున్న చిత్రంగా నిలిచింది. సౌబిన్ షహీర్, శ్రీనాథ్ భాసీ, బాలు వర్గీస్, గణపతి, లాల్ జూనియర్, దీపక్, ఖలీద్ తదితరులు నటించారు. ఫిబ్రవరి 22న థియేటర్లలో రిలీజైన ఈచిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతుంది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తుంది. ఈ సక్సెస్‌తో ఎంజాయ్ మోడ్‌లో ఉన్న దర్శకుడు ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. దేశాన్ని కాదూ.. ప్రపంచాన్నే కుదిపేసిన మీటూ ఆరోపణలు వచ్చాయి అతడిపై.

మంజుమ్మల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం ఎస్ పొదువాల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రాప్తి ఎలిజిబెత్ ఆరోపించింది. కాగా, చిదంబరం తొలి చిత్రం జాన్ ఇ మ్యాన్ చిత్రంలో ఆమె నటించడం గమనార్హం. తన ఇన్ స్టా వేదికగా.. ఈ పోస్టు చేసింది. అలాగే నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఆ సమయంలో నేను నటిస్తున్నందుకు డబ్బులు ఇస్తున్నారా లేక.. లైంగిక దాడికా అంటూ ప్రశ్నించింది.ప్రస్తుతం ఆమె కన్వర్జేషన్ అంతా కొంత మంది నెటిజన్లు స్క్రీన్ షాట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇక ప్రాప్తి విషయానికి వస్తే.. ఆమెకు సోషల్ మీడియాలో 24ే0K కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే జాన్ ఇ మ్యాన్ షూటింగ్ సమయంలో లైంగిక దాడి జరిగినట్లు తెలుస్తోంది.

సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఇలాంటి చిక్కుల్లో పడ్డారు దర్శకుడు చిదంబరం. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. కుట్టన్ (సౌబిన్ షాహిర్), సుభాష్ (శ్రీనాథ్) తన స్నేహితులతో కలిసి మంజుమ్మల్ బాయ్స్ అనే అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని.. కోడై కెనాల్ ట్రిప్ వెళతారు. అక్కడ అనుమతి లేకపోయినా.. సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి కేవ్ చూసుకేందుకు వెళతారు. లోతైన లోయలో ఉంటుంది ఈ గుహ. ఆ ఇరుకైన లోయలోకి పడిపోతాడు సుభాష్. అందులో పడితే బ్రతికి బయట పడటం అసాధ్యమని స్థానికులు చెబుతారు. మరీ సుభాష్ ను స్నేహితులు కాపాడారా లేదా అన్నది మిగిలిన కథ ఇది తెలుగులోకి రాబోతుంది. మార్చి 15న థియేటర్లోకి రాబోతుంది. ప్రముఖ దర్శకుడు క్రిష్.. తెలుగు రైట్స్ కొనుగోలు చేశారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss