సినిమా పరిశ్రమలో కొన్ని సంవత్సరాలకు ఒకసారి ట్రెండ్ మారుతూ ఉంటుంది. ఆ ట్రెండ్ కు తగ్గట్లుగా ప్రేక్షకులను తమవైపుకు తిప్పుకుంటూ ఉంటారు దర్శక, నిర్మాతలు. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో యూనివర్స్ ట్రెండ్ నడుస్తోంది. ఒక సినిమాకు మరో సినిమాకు లింక్ పెట్టి.. ఓ సిరీస్ ను ప్లాన్ చేయడమే మూవీ యూనివర్స్. ఇక ఇలాంటి యూనివర్స్ లో స్పై సినిమాలే ఎక్కువగా ఉంటాయి. హీరోలు స్పైలుగా ఉంటూ శత్రువులను అంతం చేస్తూ.. ఉంటారు. కాగా.. ఇప్పుడు ఈ స్పై యూనివర్స్ లోకి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
ఏక్ థా టైగర్ టైగర్ జిందా హై, వార్, పఠాన్ ఇవన్నీ స్పై సినిమాలే.. వీటిని బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కించింది. తాజాగా ఈ స్పై యూనివర్స్ లోకి అలియా భట్ అడుగుపెట్టబోతోందని తెలుస్తోంది. అలియా భట్ తో ఈ సంస్థ ఓ స్పై మూవీని తెరకెక్కించబోతుందని సమాచారం. అలియా ప్రధాన పాత్రలో ఓ భారీ బడ్జెట్ స్పై మూవీని ప్లాన్ చేస్తున్నారట. 2024లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చనడుస్తోంది. ఇక యశ్ రాజ్ ఫిల్మ్స్ నుంచి స్పై జోనర్ లో వస్తున్న ఎనిమిదవ సినిమా కావడం విశేషం.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొక్షన్ వర్క్స్ నడుస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యానర్ నుంచి టైగర్ 3 ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సల్మాన్ ఖాన్-కత్రినా కైఫ్ జంటగా నటిస్తున్నారు. ఆ తర్వాత ఈ సంస్థ నుంచి వార్ 2 మూవీ నవంబర్ లో సెట్స్ పైకి వెళ్తుంది. కాగా.. అలియా నటించే స్పై సిరీస్ కు ఇంకా పేరు ఖారారు చేయలేదు. ఇప్పటి వరకు లేడీ స్పై మూవీ రాలేదు కాబట్టి.. అలియా క్యారెక్టర్ ను బెస్ట్ గా డిజైన్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ మూవీని ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయం ఇంకా తెలియరాలేదు.