iDreamPost
android-app
ios-app

లిప్ లాక్ గురించి నాకేం బాధలేదు! ఎవరికైనా ఇస్తాను: బిగ్ బాస్ బ్యూటీ

  • Author ajaykrishna Published - 11:49 AM, Tue - 4 July 23
  • Author ajaykrishna Published - 11:49 AM, Tue - 4 July 23
లిప్ లాక్ గురించి నాకేం బాధలేదు! ఎవరికైనా ఇస్తాను: బిగ్ బాస్ బ్యూటీ

పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ జనాలను ఎంతగా ఎంటర్టైన్ చేస్తుందో.. అందులో పాల్గొనే కంటెస్టెంట్ లకు అదే రేంజ్ లో తంటాలు తెచ్చిపెడుతుంది. సౌత్ లో బిగ్ బాస్ షో ఓ ధోరణిలో వెళ్తోంది. కానీ.. హిందీ బిగ్ బాస్ విషయానికి వస్తే.. రోజురోజుకి నానా రచ్చ జరుగుతుంది. తెల్లారే సరికి సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఇటీవల బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ ఓటిటి సీజన్ 2లో ఓ జంట పెద్ద దుమారమే లేపారు. చుట్టూ కెమెరాలు ఉన్నాయనే విషయాన్ని పట్టించుకోకుండా.. ఏకంగా ఓ నిమిషం పాటు లిప్ లాక్ పెట్టుకున్నారు. ఆ వీడియో కాస్త వైరల్ గా మారి ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఆ వివరాల్లోకి వెళ్తే.. హిందీ బిగ్ బాస్ ఓటిటి సీజన్ 2లో నటి ఆకాంక్ష పూరి కంటెస్టెంట్ గా పాల్గొంది. ఆల్రెడీ ఆకాంక్షకి బయట బోల్డ్ బ్యూటీ అనే పేరుంది. అలాంటిది బిగ్ బాస్ లాంటి షోలో పాల్గొంటే ఏమైనా ఉందా.. సరే ఉండనిలే అనుకుంటే ఊరుకుందా! ఏకంగా తోటి కంటెస్టెంట్ జైద్ కి ఘాటైన పెదవి ముద్దు అందించి ట్రోల్స్ ఫేస్ చేస్తోంది. అందరూ చూసే షోలో ఆకాంక్ష అలా చేసేసరికి అటు ప్రేక్షకులకు, ఇటు హోస్ట్ సల్మాన్ కి కోపం వచ్చేసింది. కట్ చేస్తే.. ముద్దు పెట్టిన ఎంజాయ్ మెంట్ పక్కన పెట్టి ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అయితే.. రీసెంట్ గా షో నుండి ఎలిమినేట్ అయి బయటికి వచ్చిన ఆకాంక్ష పూరి.. తన ఎలిమినేషన్ తో పాటు లిప్ లాక్ ఇష్యూపై కూడా స్పందించింది.

ఈ విషయంపై ఆకాంక్ష మాట్లాడుతూ.. ‘షో నుండి బయటికి వచ్చినందుకు చాలా బాధగా ఉంది. కానీ.. లిప్ లాక్ గురించి నాకేం బాధ లేదు. ఎందుకంటే.. లిప్ లాక్ ఓ టాస్క్ పరంగా షోలో పెట్టాల్సి వచ్చింది. నాకు 30 సెకండ్ల లిప్ లాక్ టాస్క్ ఇచ్చారు. అక్కడ టాస్క్ ముఖ్యం కాబట్టి అలా చేశాను. పర్సనల్ గా నాకు లిప్ లాక్ పై పెద్దగా ఇంటరెస్ట్ లేదు. అదిగాక టాస్క్ కాబట్టి.. జైద్ ప్లేస్ లో ఎవరున్నా అలాగే చేసేదాన్ని. అయితే లిప్ లాక్ సంగతి ఇంత పెద్ద ఇష్యూగా మారుతుందని, హోస్ట్ సల్మాన్ కి అంత కోపం వస్తుందని బయటికి వచ్చాకే తెలిసింది.’ అని చెప్పుకొచ్చింది. ఇక ఈ ఇష్యూ కారణంగా మరి కొద్దిరోజుల్లో కంటెస్టెంట్ జైద్ కూడా ఎలిమినేట్ కావచ్చని టాక్. మరి ఆకాంక్ష పూరి లిప్ లాక్ ఇష్యూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom