iDreamPost
android-app
ios-app

నమ్మించి.. ప్రముఖ నటుడికి రూ. 1.55 కోట్ల టోకరా!

  • Author Soma Sekhar Updated - 08:08 AM, Sat - 22 July 23
  • Author Soma Sekhar Updated - 08:08 AM, Sat - 22 July 23
నమ్మించి.. ప్రముఖ నటుడికి రూ. 1.55 కోట్ల టోకరా!

‘ధనం మూలం ఇదం జగత్’ అన్న సామెతను అక్షరాలా నిజం చేస్తూ.. నేటి సమాజంలో ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. డబ్బు కోసం బయటి వ్యక్తులనే కాక.. సొంత బంధువులు, కుటుంబ సభ్యులను కూడా డబ్బుల కోసం మోసం చేస్తున్నారు. కొన్ని కొన్ని సార్లు హత్యలు కూడా చేస్తున్నారు. ఇక సామాన్యులతో పాటుగా.. సెలబ్రిటీలు కూడా మోసాల బారిన పడుతున్నారు. కొందరు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే.. మరికొందరు తెలిసిన వారి చేతిలో కోట్లకు కోట్లకు మోసపోతున్నారు. తాజాగా ప్రముఖ నటుడు, బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ ని నమ్మించి మోసం చేసి.. రూ. 1.55 కోట్లు టోకరా వేశారు భాగస్వాములు.

వివేక్ ఒబెరాయ్.. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్ లో స్టార్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న ఈ నటుడు తాజాగా తన స్నేహితుల చేతిలో రూ. 1.55 కోట్లు మోసపోయాడు. వివరాల్లోకి వెళితే.. వివేక్ ఒబెరాయ్ కు ఈవెంట్, మూవీ నిర్మాణ సంస్థలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని అతడికి తెలిసిన స్నేహితులు నమ్మించారు. దాంతో ఓ సినీ నిర్మాత, వివేక్ ఒబెరాయ్ వారిని నమ్మి సదరు సంస్థలో పెట్టుబడులు పెట్టారు. అందులో వివేక్ ఒబెరాయ్ రూ. 1.55 కోట్లు పెట్టుబడిగా పెట్టాడు. అయితే ఆ సొమ్మును ముగ్గురు వ్యక్తులు తమ సొంతానికి వాడుకున్నారు. ఇది తెలుసుకున్న అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో నిందితులపై పోలీస్ కేసు నమోదు చేశారు. కాగా.. సదరు ఈవెంట్, సినీ నిర్మాణ సంస్థలో వివేకె ఒబెరాయ్ కూడా భాగస్వామిగా ఉండటం గమనార్హం.

ఇదికూడా చదవండి: ప్రముఖ సింగర్ కు ఊహించని అనుభవం.. పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetpark girişgrandpashabet