iDreamPost
android-app
ios-app

ప్రముఖ సింగర్ కు ఊహించని అనుభవం.. పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి!

ప్రముఖ సింగర్ కు ఊహించని అనుభవం.. పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి!

సాధారణంగా కష్టపడితే సక్సెస్ వస్తుంది. సక్సెస్ వస్తే లైఫ్ లో మంచి పేరు, గుర్తింపు వస్తుంది. చాలా మంది అలాంటి గుర్తింపు రావాలని, పేరు ప్రఖ్యాతలు గడించాలని కోరుకుంటారు. పెద్ద సెలబ్రిటీ అయిపోతే తమ లైఫ్ లో ఇంక దిగులు ఉండదు అని ఊహించుకుంటారు. కానీ, నిజానికి సెలబ్రిటీలకే ఎక్కడ లేని కష్టాలు అన్నీ వస్తాయి. ఒక సెలబ్రిటీగా జీవించడం ఎంతో కష్టం. వాళ్లు అందరిలా జీవించలేరు, నచ్చింది తినలేరు, నచ్చిన చోటుకు వెళ్లలేరు నిజానికి ఎంత ఫేమస్ అయినా కూడా కొన్నిసార్లు వాళ్లు నో అని కూడా చెప్పలేరు. అదై విషయాన్ని ఒక ప్రముఖ సింగర్ వెల్లడించాడు. తన జీవితంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చాడు.

ఆ ప్రముఖ సింగర్ మరెవరో కాదు.. పంజాబీ ఆల్బమ్స్ తో పాపులర్ అయిన సుధీర్ యదువంశీ. అతనికి తాజాగా ఒక ఊహించని సంఘటన అనుభవమైంది. ఆ విషయాన్ని స్వయంగా సుధీర్ యదువంశీనే వెల్లడించాడు. ఒక పెళ్లి సంగీత్ కు పాటలు పాడేందుకు వెళ్లగా స్టేజ్ పై అతని తలకు గన్ గురి పెట్టారని అందరికీ షాకిచ్చాడు. పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి పాట పాడాలని వేధించినట్లు చెప్పుకొచ్చాడు. సుధీర్ యదువంశీ చెప్పిన విషయం విని చాలా మంది అవాక్కయ్యారు. ఎందుకంటే ఒక సెలబ్రిటీకి పబ్లిక్ లో గన్ గురి పెట్టారా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

“నేను ఓ పెళ్లి సంగీత్ లో పాడుతున్నాను. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి తాను రాసిచ్చిన పాట పాడాలని కోరాడు. అందుకు నేను కుదరదు అని చెప్పాను. కానీ, అతను అక్కడి నుంచి వెళ్లకుండా నన్ను వేధిస్తునే ఉన్నాడు. కానీ, నేను అతడిని పట్టించుకోకుండా నా పని నేను చేసుకున్నాను. కాసేపు అడిగి అతనే వెళ్లిపోతాడు అని భావించాను. కానీ, అతను అలా వెళ్లలేదు. నేను అస్సలు ఊహించలేని విధంగా రెస్పాండ్ అయ్యాడు. నేను కిందికి వెళ్లేందుకు సిద్ధమయ్యాను. అతడు నన్ను ఫాలో నా వెనకాలే వచ్చాడు. అతని వద్దనున్న గన్ తీసి నాకు చూపించాడు.

అతని దగ్గరున్న గన్ నా తలకు గురి పెట్టాడు. ఇప్పుడు చెప్పు నేను అడిగిన పాట పాడతావా లేదా? అంటూ ప్రశ్నించాడు. కాసేపు నాకు ఏం అర్థం కాలేదు. నేను షాక్ లో ఉండిపోయాను. పాట పాడితేనే నువ్వు స్టేజ్ దిగుతావ్ అంటూ హెచ్చరించాడు. నాకు ఏం చేయాలో పాలు పోలేదు. అతను రాసిచ్చిన పాట పాడటం తప్ప నాకు వేరే మార్గం లేదు. నేను చివరికి అతడు కోరిన పాట పాడాను. అది కూడా మూడుసార్లు పాడాల్సి వచ్చింది” అంటూ సుధీర్ యదువంశీ వెల్లడించాడు. ఈ ఘటన ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఒక ప్రముఖ సింగర్ కు అలాంటి వేధింపులు ఎదురవ్వడం నిజంగా బాధాకరం అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై కచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకోవాలి అంటూ నెటిజన్స్ కోరుతున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbankobet girişgrandpashabet