iDreamPost
android-app
ios-app

Vijayakanth: తమిళ దిగ్గజం రాలిపోయింది.. విజయ్ కాంత్ గురించి కొన్ని నిజాలు..

గత కొంత కాలంగా సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు నెలకొంటున్న విషయం తెలిసిందే. ప్రమున నటీనటులు కన్నుమూస్తున్నారు.. దీంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం విషాదంలో మునిగిపోతున్నారు.

గత కొంత కాలంగా సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు నెలకొంటున్న విషయం తెలిసిందే. ప్రమున నటీనటులు కన్నుమూస్తున్నారు.. దీంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం విషాదంలో మునిగిపోతున్నారు.

Vijayakanth: తమిళ దిగ్గజం రాలిపోయింది.. విజయ్ కాంత్ గురించి కొన్ని నిజాలు..

తమిళ కథానాయకుడు విజయకాంత్ ఈరోజు ఉదయం కోవిడ్ కారణంగా తుది శ్వాసను వదలినట్టుగా డాక్టర్లు నిర్ధారించారు. ఇంతకు ముందే శ్వాస  సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న విజయకాంత్ చాలా కాలం వెంటిలేటర్ మీదనే ఉండాల్సివచ్చింది.  ఆయనకు ఆరోగ్యం బాగులేక హాస్పిటల్లో జాయిన్ అయిన దగ్గర్నుంచి ఆయన అభిమానులు చాలా ఆందోళనలో ఉన్నారు. రాజకీయంగా, సినిమారంగం పరంగా కూడా విజయ్ కాంత్ కెరీర్ కొంత ప్రత్యేకతను సంతరించుకున్న మాట వాస్తవం. 1984 సంవత్సరంలోనైతే ఏకంగా ఆయన హీరోగా నటించిన 18 సినిమాలు రిలీజై రికార్డుగా నిలిచిపోయింది. 80, 90దశకాలలో హీరోగా విజయ్ కాంత్ రజనీకాంత్ ఇమేజ్‌నే ఛాలెంజ్ చేసే స్థాయికి చేరుకుంది. యాక్షన్ సన్నివేశాలలో ఢూప్ లేకుండా రిస్కీ ఫైట్లు చేయడంలో విజయకాంత్ హీరోయిజంపైన చెరగని ముద్ర వేసి మాస్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుని, తిరుగులేని మాస్ హీరోగా ఎదిగారు. షూటింగ్ లలో అందరికీ ఒకేరకమైన భోజనం ఉండాలని, నాన్ వెజిటేరియన్ యూనిట్లో అందరికీ ఉండాలని, కష్టపడి పనిచేసే వర్కర్లకు సరియైన భోజనం పెడితేనే వారు కష్టించి పనిచేయగలరనే ఓ కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టి, చిత్రపరిశ్రమలో అరుదైన స్థానాన్ని సాధించుకున్న ఘనత విజయకాంత్ కి చెందుతుంది. ఎంజిఆర్ తర్వాత ఇటువంటి మానవతావిలువలను పాటించి, అమలు చేసిన హీరోగా విజయకాంత్ అందరినీ మెప్పించి, కురుప్పు ఎంజిఆర్ అనే చిరస్థాయి కీర్తిని సంపాదించుకున్నారు.

తన హీరోయిజానికి ఇంక తిరుగులేదని అనుకున్న తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేసి, తన ఫేన్ క్లబ్ లను., అభిమానులను ఉత్తేజపరచి డిఎండికె పార్టీని 2005లో స్థాపించారు. తొలి ఎన్నికలలో కేవలం ఒకే ఒక్క సీటును గెలుచుకున్నా, ఆ ఒక్కసీటుతోనే ప్రతిఫక్షంలో సమర్థవంతమైన పాత్రను పోషించిన తమిళ నాయకుడిగా సంచలనాలను నెలకొల్సారు. తర్వాతి రోజులలో అన్నా డిఎంకె పార్టీతో చేతులు కలిపి 29 సీట్లను కైవశం చేసుకున్నారు విజయకాంత్. దక్షిణాది నటసంఘం కోసం అమెరికావెళ్ళి మరీ నిధులను సేకరించి, ఆ సంస్థ పురోగతికి తనదైన   సేవలను అందించిన మంచి మనిషిగా ఆయనకు ప్రత్యేక స్థానం లభించింది. ఆయన నటించిన సినిమాలు అనేకం తెలుగు, మలయాళ, కన్నడ భాషలలో రీమేక్ చేశారు. ఆయన నటించిన చినగౌండర్ తెలుగులో వెంకటేష్ చినరాయుడి టైటిల్ తో తెలుగులో చేశారు.

తెలుగులో కూడా విజయకాంత్ నటించిన చిత్రాలు డబ్ అయినవి హిట్స్ అయి, తెలుగులో కూడా ఆయనకి అభిమానులు పుట్టుకొచ్చారు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమిళనాడు బోర్డర్ జిల్లాల్లో విజయకాంత్ నటించిన తమిళ చిత్రాలు బంపర్ హిట్స్ అయ్యాయి. దాదాపు 154 చిత్రాలలో నటించిన విజయకాంత్ నటించిన కెప్టెన్ ప్రభాకర్ చిత్రం పెద్ద హిట్ కావడంతో, అనాటి నుంచి విజయకాంత్ ని అభిమానులు కెప్టెన్ గా పిలుచుకోవడం మొదలుపెట్టారు.  తమిళనాడులో పుట్టినా ఆంధ్ర కమ్మ సామాజిక వర్గానికి చెందిన విజయకాంత్ 71 సంవత్సరాల వయసులో మరణించారు. గతంలో కూడా ఆమెరికా వెళ్ళి ట్రీట్ మెంట్ పుచ్చుకున్నా కూడా విజయకాంత్ ఆరోగ్యం తీవ్రమైన డయాబటీస్ కారణంగా రోజురోజుకీ క్షీణిస్తూ వచ్చింది. విజయకాంత్ మరణించారని తెల్సిన వెంటనే తమిళ చిత్రపరిశ్రమలో వర్కర్ల యూనియన్ మాత్రం కన్నీరుమున్నీరుగా విలపించింది. కేవలం సినిమా హీరోగానే కాదు, మనసున్న మనిషిగా, మానవతావాదిగా నిలకడైన వ్యక్తిత్వంతో అందరి మన్ననలకు పాత్రమైన జీవితాన్ని గడిపారు విజయకాంత్.