iDreamPost
android-app
ios-app

ఆస్పత్రిలో చేరిన విజయకాంత్‌.. ఆందోళనలో అభిమానులు!

  • Published Nov 20, 2023 | 10:13 AM Updated Updated Nov 20, 2023 | 10:13 AM

ఈ మద్య కాలంలో వరుసగా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నటీనటులు అనారోగ్యంతో కన్నుమూయడం, ఆస్పత్రుల్లో చేరడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఈ మద్య కాలంలో వరుసగా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నటీనటులు అనారోగ్యంతో కన్నుమూయడం, ఆస్పత్రుల్లో చేరడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

  • Published Nov 20, 2023 | 10:13 AMUpdated Nov 20, 2023 | 10:13 AM
ఆస్పత్రిలో చేరిన విజయకాంత్‌.. ఆందోళనలో అభిమానులు!

ఇటీవల సినీ ఇండస్ట్రీలో పలు విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాము ఎంతగానో అభిమానించే నటీనటులు, దర్శక, నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్ హఠాత్తుగా కన్నుమూయడం, తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి లో చేరడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇటీవల పలువురు సినీ నటులు అనారోగ్య కారణంగా హాస్పత్రిలో చేరుతున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ నటుడు, రాజకీయ నాయకుడు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

తమిళ స్టార్ నటుడు, డీఎంయూడీ వ్యవస్థాపకులు, నటీనటుల సంఘం మాజీ అధ్యక్షులు విజయ్ కాంత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని మాయత్ హాస్పిటల్ లో చేరారు. గతంలో పలుమార్లు ఆయన అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కొంతకాలంగా పార్టీ బాధ్యతలను కోశాధికారి అయిన ఆయన సతీమణి ప్రేమలత విజయ్ కాంత్ భుజాన వేసుకొని ముందుకుసాగుతున్నారు. విజయ్ కాంత్ కు గొంతునొప్పి, దగ్గు, జలుబు ఇతర సమస్యలతో బాధపడుతున్నారని.. వైద్య పరీక్షల అనంతరం ఆయన తిరిగి ఇంటికి చేరుకుంటారని సమాచారం. ఆయన కొంతకాలంగా మధుమేహ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ కారణంతోనే ఆయన మూడు వేళ్లను వైద్యులు తొలగించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నట్టు సమాచారం.

ప్రస్తుతం విజయ్ కాంత్ ఆరోగ్యం బాగా క్షీణించిందని వైద్యులు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. 70 ఏళ్ల వయసు ఉన్న విజయ్ కాంత్ 1979 ఇనిక్కుం ఇలామై మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఎక్కువగా పోలీస్ అధికారి పాత్రల్లో నటించి  తనదైన ముద్రవేశారు. ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉండగానే 2005 సెప్టెంబరు 14న దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం (డీఎంయూడీ) పార్టీని స్థాపించాడు. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ఇంటికే పరిమితం అయ్యారు.. దీంతో పార్టీ కేడర్ కన్నీటి పర్యంతం అయ్యింది. విజయ్ కాంత్ ఆస్పత్రిలో చేరడంతో తమిళనాట రక రకాల పుకార్లు పుట్టుకు వచ్చాయి. విజయ్ కాంత్ ఆస్పత్రిలో చేరడంతో అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దీనిపై పార్టీ కేడర్ స్పందిస్తూ.. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.. రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.