iDreamPost
android-app
ios-app

హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న వెంకటేశ్ కొడుకు? ఏకంగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో..

  • Author Soma Sekhar Published - 02:53 PM, Wed - 21 June 23
  • Author Soma Sekhar Published - 02:53 PM, Wed - 21 June 23
హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న వెంకటేశ్ కొడుకు? ఏకంగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో..

సాధారణంగా తమ తండ్రులు కొనసాగించిన వృత్తినే ఎన్నుకుంటారు చాలా మంది వారసులు. తమ తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకుని ఆ రంగంలో తమదైన ముద్రవేయాలని భావిస్తుంటారు. ఇలా తండ్రి వారసత్వం కొనసాగించడం ఎక్కువగా రాజకీయాల్లో, సినిమా ఇండస్ట్రీలో మనం చూస్తుంటాం. ఇక రాజకీయ రంగంలో ఇప్పటికే చాలా మంది తల్లిదండ్రుల వారసత్వాన్ని తీసుకుని రాణిస్తున్న సంగతి మనకు తెలియనిది కాదు. ఇక సినిమా ఇండస్ట్రీలో వారసులుగా తండ్రికి తగ్గ కొడుకులుగా ఎంతో మంది హీరోలు నిరూపించుకున్నారు. తాజాగా టాలీవుడ్ లోకి మరో వారసుడు రాబోతున్నాడు అన్న న్యూస్ ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే విక్టరీ వెంకటేష్ కొడుకు అర్జున్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.

విక్టరీ వెంకటేష్.. టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నారు. ప్రేక్షకులను నవ్వించడంలో వెంకీ మామది ప్రత్యేక శైలి. అలాగే సెంటిమెంట్ ను పండించడంలో కూడా తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు విక్టరీ వెంకటేష్. అదీకాక ఎప్పుడో ఇండస్ట్రీ మరచిపోయిన మల్టీస్టారర్ మూవీస్ ను స్టార్ట్ చేసింది కూడా వెంకీ మామ అనే చెప్పాలి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు తో పాటు నాగచైతన్యతో మరో సినిమాలో నటించారు. అప్పటి నుంచి మల్టీస్టారర్ కాన్సెప్ట్ ఊపందుకుందనే చెప్పాలి. ఇదంతా కాసేపు పక్కన పెడితే.. దగ్గుపాటి వంశం నుండి మరో హీరో టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ కొడుకు అర్జున్ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు అన్న వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

ఇక అర్జున్ మెుదటి చిత్రానికి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. అన్ని వర్గాలకు నచ్చేవిధంగా ఈ కథను రెడీ చేశారట త్రివిక్రమ్. ఇక ఆ కథ వెంకటేష్ కు ఎంతో నచ్చిందట. ప్రస్తుతం అర్జున్ విదేశాల్లో చదువుకుంటున్నాడని అతడి చదువు పూర్తికాగానే.. సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని పరిశ్రమ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అన్ని కుదిరితే వచ్చే ఏడాదిలోనే దగ్గుబాటి మరో వారసుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటున్నారు సినీ పండితులు. ప్రస్తుతం వెంకటేష్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో ‘సైంధవ్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetCasibomgrandpashabetJojobet Girişbigboss