iDreamPost
android-app
ios-app

బైకర్ ను కారుతో ఢీకొట్టి.. పారిపోయిన హీరో! CCTV ఫుటేజీ వైరల్..

  • Author Soma Sekhar Updated - 05:20 PM, Sat - 12 August 23
  • Author Soma Sekhar Updated - 05:20 PM, Sat - 12 August 23
బైకర్ ను కారుతో ఢీకొట్టి.. పారిపోయిన హీరో! CCTV ఫుటేజీ వైరల్..

యూట్యూబ్ లో వీడియోలు చేసి ఫేమస్ అయ్యాడు ఈ నటుడు. ఇక సోషల్ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపుతో ఏకంగా సినిమా ఛాన్స్ నే కొట్టేశాడు ఈ యువకుడు. మూవీ ఛాన్స్ అంటే ఏ క్యారెక్టర్ ఆర్టిస్టుగానో.. లేక కమెడియన్ గానో అనుకుంటే మనం పొరపడ్డట్లే. అతడు ఏకంగా సినిమాలో హీరో ఛాన్స్ నే కొట్టేశాడు. కొన్నిరోజుల క్రితమే అతడి భర్త్ డే సందర్బంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఎప్పుడూ వివాదాల్లో ఉండే.. ఈ యువ నటుడు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఓ బైకర్ ను ఢీకొట్టిన ఘటనలో తీవ్ర విమర్శల పాలవుతున్నాడు TTF వాసన్.

టీటీఎఫ్ వాసన్.. యూట్యూబ్ వీడియోల ద్వారా వచ్చిన క్రేజ్ తో ఏకంగా సినిమా హీరో ఛాన్స్ కొట్టేశాడు. వాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం’మండల్ వీరన్’. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను వాసన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కు అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. కాగా.. టీటీఎఫ్ వాసన్ తరచుగా ఏదో ఒక వివాదంలో నిలుస్తూ ఉంటాడు. తాజాగా మరో సమస్యలో చిక్కుకుని వార్తల్లో నిలిచాడు.

అసలు విషయం ఏంటంటే? కారులో వేగంగా వెళ్తున్న వాసన్.. పక్కనున్న డివైడర్ ను ఢీకొట్టడంతో.. కారు అదుపుతప్పింది. దాంతో ముందు వెళ్తున్న బైక్ ను ఢీకొట్టడంతో.. బైకర్ కిందపడి, స్వల్ప గాయాలపాలైయ్యాడు. ఈ ఘటనలో కారు ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నది. అయితే కింద పడ్డ బైకర్ ను కనీసం లేపకుండా ఘటనా స్థలం నుంచి పారిపోయాడు వాసన్. తన కారును అక్కడే వదిలేసి.. ఆటో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో గాయపడిన బైకర్ ను కనీసం చూడకుండా వెళ్లిపోయిన వాసన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss