iDreamPost
android-app
ios-app

జిమ్‌లో సూర్యతో కలిసి జ్యోతిక వర్క్ అవుట్స్.. వీడియో వైరల్

  • Published Apr 02, 2024 | 9:57 PM Updated Updated Apr 02, 2024 | 9:57 PM

Suriya Gym Workouts: సిసీ ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది నటీ నటులు తమ సహనటులను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అలాంటి ప్రేమజంట సూర్య, జ్యోతిక ఒకరు.

Suriya Gym Workouts: సిసీ ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది నటీ నటులు తమ సహనటులను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అలాంటి ప్రేమజంట సూర్య, జ్యోతిక ఒకరు.

  • Published Apr 02, 2024 | 9:57 PMUpdated Apr 02, 2024 | 9:57 PM
జిమ్‌లో సూర్యతో కలిసి జ్యోతిక వర్క్ అవుట్స్.. వీడియో వైరల్

ఇప్పటి వరకు సినీమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు తమ సహ నటులను ప్రేమించి కొంతకాలం లివింగ్ రిలేషన్ లో ఉంటూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కొన్ని జంటలు ఇప్పటికీ కలిసిమెలిసి అన్యోన్య దంపతులుగా కొనసాగుతున్నారు. కొన్ని జంటలు మాత్రం విభేదాలు రావడంతో విడిపోయారు. ఇండస్ట్రీలో లవ్ లీ కపుల్స్ గా పేరు తెచ్చుకున్న వారిలో సూర్య, జ్యోతిక ఒకరు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు సంతానం.  తాజాగా సూర్య, జ్యోతిక జిమ్ లో వర్క్ ఔట్ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. వివరాల్లోకి వెళితే..

కోలీవుడ్ స్టార్ కపుల్స్ సూర్య, జ్యోతికకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ జంట ఎక్కడికి వెళ్లినా అభిమానులు తెగ హడావుడి చేస్తుంటారు. తమదైన బాండింగ్ తో ఈ జంట అందరి మనసు దోచారు. ఒకే ప్రోఫేషన్ లో ఉంటూ ఇద్దరి మధ్య ఇంత బాండింగ్ ఉండటం నిజంగా గ్రేట్ అంటుంటారు. ఈ జంటకు ఇద్దరు సంతానం. ప్రతి విషయంలోనూ భర్తకు తోడూగా ఉంటూ ఇండస్ట్రీలో ఆయన ఎదుగుదలకు ఆమె కృషి ఎంతో ఉందని పలు ఇంటర్వ్యూలో తెలిపారు సూర్య.  షూటింగ్ తర్వాత ఎక్కువగా తన కుటుంబంతో కలిసి ఉంటారు సూర్య. పెళ్లైన తర్వాత చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చింది. ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చింది జ్యోతిక. తాజాగా ఈ లవ్ లీ కపుల్స్ జిమ్ లో వర్క్ ఔట్ చేస్తున్న ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

surya

ప్రస్తుతం సూర్య ‘కంగువ’ మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన వ్యూజువల్స్, టీజర్ సోషల్ మీడియాలో బాగా ఆకట్టుకున్నాయి. ఈ  చిత్రంలో సూర్య పాత్ర ఎంతో రౌద్రంగా కనిపించబోతుంది. ఇందుకోసం ఆయన కండలు పెంచుకుంటున్నారు. అందుకోసం జిమ్ లో ఎక్కువ సమయాన్ని గడపాల్సి వస్తున్నట్లు సమాచారం. ఎప్పుడూ భర్తకు సాయంగా ఉండే జ్యోతిక జిమ్ లో సూర్యకు సహాయం అందిస్తుంది. సూర్యతో పాటు ప్రతి వర్క్ ఔట్ చేస్తూ భర్తకు స్పిరిట్ గా నిలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. భర్తకు తగ్గ భార్య అనిపించుకుంటున్నావని కొందరు.. వావ్.. పర్ఫెక్ట్ కపుల్ గోల్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet