iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!

  • Published Apr 10, 2024 | 1:53 PM Updated Updated Apr 10, 2024 | 1:53 PM

Actor Sujith Rajendran Passed away: ఈ మద్య కాలంలో సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు.

Actor Sujith Rajendran Passed away: ఈ మద్య కాలంలో సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు.

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలతో పాటు ఇతర రంగాలకు చెందిన వారు కన్నుమూస్తున్నారు. వారే కాదు వారి కుటుంబ సభ్యులు కూడా కన్నుమూస్తున్నారు. వయోభారం, అనారోగ్యం, హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాల వల్ల కొంతమంది సెలబ్రెటీలు చనిపోతే.. కెరీర్ ఇబ్బందులు, ఆర్థిక కష్టాలు తట్టుకోలేక మరికొంతమంది సెలబ్రెటీలు బలవన్మరణాలకు పాల్పపడుతున్నారు. మధ్య ప్రముఖ నటి మీరా జాస్మిన్ తండ్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా మాలీవుడ్ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..

కోలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురపై ప్రముఖ నటుడు సుజిత్ రాజేంద్రన్ ఉగాది పండుగ రోజు కన్నుమూశారు. కేరళాలని ఎర్నాకులంలో స్థానిక ఆస్పత్రిలో వారం రోజులుగా ఆయన తీవ్ర గాయాలతో పోరాటం చేస్తూ కన్నుమూశారు. 2018 లో సుజిత్ ‘కినవల్లి’ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో ఓ పాట కూడా పాడారు సుజిత్. నటుడిగానే కాకుండా వివిధ రంగాల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆయన దుబాయ్ లో పెరిగినప్పటికీ నటనపై ఆసక్తితో కేరళా తన సొంత రాష్ట్రానికి వచ్చాడు. అక్కడ నటుడిగా ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం ఎదురు చూశాడు.  ఇందు కోసం అమెరికాలో ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగాన్ని సైతం వదిలిపెట్టారు.

Famous actor passed away

సుజిత్ రాజేంద్రన్ ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. నటనపైనే కాదు.. శాస్త్రీయ నృత్యంలో మంచి శిక్షణ పొంది పలు ప్రదర్శనలు కూడా ఇచ్చారు. అలా తన ప్రదర్శనలతో పలువురు దర్శక, నిర్మాతల దృష్టిని ఆకర్శించారు. ఆయనలో ఉన్న నటన గుర్తించిన దర్శకుడు సుగిత్ చిత్రం ‘కినవల్లి’ మూవీలో ఛాన్స్ ఇచ్చారు. చాలా వరకు హాస్య పాత్రలో పోషించాడు సుజిత్. మార్చి 26న సుజీత్ రాజేంద్రన్ ప్రమాదానికి గురయ్యారు. వెంటనే ఆయనను స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సుజీత్ వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఏప్రిల్ 9, మంగళారం కన్నుమూశారు. తొన్నియాకాపు స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. నటుడు సుజిత్ రాజేంద్రన్ మృతిపై పలువురు సెలబ్రెటీలు సోషల్ మీడియా వేధికగా నివాళులర్పించారు.