Venkateswarlu
తర్వాత పలు చిత్రాల్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. 2020లో వచ్చిన కలర్ ఫొటో సినిమాతో హీరో అయ్యారు. ఈ సినిమా జాతీయ అవార్డు గెలుచుకుంది.
తర్వాత పలు చిత్రాల్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. 2020లో వచ్చిన కలర్ ఫొటో సినిమాతో హీరో అయ్యారు. ఈ సినిమా జాతీయ అవార్డు గెలుచుకుంది.
Venkateswarlu
షార్ట్ ఫిల్మ్‌లతో యాక్టింగ్ కెరీర్‌ను మొదలుపెట్టి.. సినిమాల్లో రాణిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. అయితే, షార్ట్‌ఫిల్మ్‌ల ద్వారా సినిమాల్లోకి వచ్చి హీరో అయిన వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో సుహాస్ ఒకరు. దాదాపు 2015లో ఆయన షార్ట్‌ఫిల్మ్‌లు చేయటం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2018లో వచ్చిన ‘పడిపడి లేచే మనసు’ సినిమాతో వెండి తెరపైకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు.
తర్వాత పలు చిత్రాల్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. 2020లో వచ్చిన కలర్ ఫొటో సినిమాతో హీరో అయ్యారు. ఈ సినిమా జాతీయ అవార్డు గెలుచుకుంది. తర్వాత వచ్చిన ‘ రైటర్ పద్మ భూషన్ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆయన నటించిన ‘ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సినిమా టీం చురుగ్గా ప్రమోషన్లలో పాల్గొంటోంది. సోమవారం సినిమా మొదటి పాట విడుదల కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన పెళ్లి గురించి చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘నా పెళ్లి అనుకోకుండా జరిగింది. చిన్న తిరపతికి వెళ్లి చేసేసుకున్నాం. దారిలో తాళిబొట్టు కొనుక్కొని, దారిలో బట్టలు కొనుక్కొని వెళ్లాను. నీ అవతారం ఏంటి.. నువ్వు పెళ్లికొడుకువేంటి అని పంతులు తిట్టాడు. అలాంటి పరిస్థితుల మధ్య నేను పెళ్లిచేసుకున్నాను. కాబట్టి ఎలాంటి బ్యాండూ లేదు’ అని అన్నారు. మరి, సుహాస్ తన పెళ్లిపై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.