iDreamPost
android-app
ios-app

ముచ్చటగా మూడోసారి తండ్రి కాబోతున్న స్టార్ హీరో..!

  • Published May 31, 2024 | 11:58 AM Updated Updated May 31, 2024 | 11:58 AM

టెలివిజన్ రంగంలో తమదైన మార్క్ చాటుకున్న పలువురు యాంకర్లు తర్వాత వెండితెరపై తమ సత్తా చాటారు. హీరో హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మంచి పేరు సంపాదించారు.

టెలివిజన్ రంగంలో తమదైన మార్క్ చాటుకున్న పలువురు యాంకర్లు తర్వాత వెండితెరపై తమ సత్తా చాటారు. హీరో హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మంచి పేరు సంపాదించారు.

  • Published May 31, 2024 | 11:58 AMUpdated May 31, 2024 | 11:58 AM
ముచ్చటగా మూడోసారి తండ్రి కాబోతున్న స్టార్ హీరో..!

బుల్లితెరపై యాంకర్లుగా ఎంట్రీ ఇచ్చిన వారు తర్వాత వెండితెరపై హీరో, హీరోయిన్లుగా రాణించారు. గతంలో తెలుగు బుల్లితెరపై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన శివాజా తర్వాత హీరోగా మారాడు. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 7 లో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తమిళనాట ప్రముఖ టీవీ ఛానల్ అయిన విజయ్ టీవీలో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత ‘మెరినా’ చిత్రంతో హీరోగా మారాడు శివ కార్తికేయన్. తమిళ ఇండస్ట్రీలోనే కాదు టాలీవుడ్ లో కూడా శివ కార్తికేయన్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎలాంటి కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటారు శివ కార్తికేయన్. తాజాగా ఈ హీరో గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ప్రముఖ హీరో శివ కార్తికేయన్ త్వరలో తండ్రి కాబోతున్నాడని సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. తమిళ నాట ప్రముఖ ఛానల్ విజయ్ టీవీలో వ్యాఖ్యాతగా పనిచేసిన శివ కార్తికేయన్ తర్వాత ప్రముఖ దర్శకుడు పాండియరాజన్ దర్శకత్వంలో ‘మెరినా’ మూవీతో హీరోగా మారాడు. ఆ తర్వాత వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. శివ కార్తీకేయన్-ఆర్తి దంపతులకు ఇద్దరు పిల్లలు. చాలా కాలం తర్వాత వీరు మూడో బిడ్డ కోసం ప్లాన్ చేసినట్లు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది. ఓ అభిమాని తనయుడి పుట్టిన రోజు కార్యక్రమానికి శివ కార్తి కేయన్ తన భార్య, కూతురితో వెళ్లాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో శివ కార్తికేయన్ సతీమణి ఆర్తి బేబీ బంప్‌తో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో మరో జూనియర్ శివ కార్తికేయన్ రాబోతున్నాడని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ విషయంపై శివ కార్తికేయన్ క్లారిటీ ఇవ్వలేదు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందే 2010 లో ఆర్తీని వివాహం చేసుకున్నాడు. 2013 కూతురు ఆరాధన, 2021 కుమారుడు గుగన్ దాస్ జన్మించారు. శివ కార్తికేయన్ హీరోగానే కాదు సింగర్ కూడా రాణిస్తున్నారు. ఆయన నటించిన అమరన్ మూవీ రిలీజ్ కి సిద్దంగా ఉంది. త్వరలో ఏఆర్ మురుగదాస్ తో ఓ చిత్రంలో నటించబోతున్నాడు.

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom giriş