iDreamPost
android-app
ios-app

Actor Shivaji: శివాజీ సంచలన వ్యాఖ్యలు.. అవి ప్రూవ్ చేస్తే చచ్చిపోతానంటూ..

  • Published Jan 13, 2024 | 9:20 PM Updated Updated Jan 13, 2024 | 9:20 PM

బిగ్ బాస్ తర్వాత శివాజీకి వెబ్ సిరీస్ రూపంలో మరో హిట్ దక్కింది. ప్రస్తుతం వెకేషన్ మోడ్ లో ఉన్నాడు.

బిగ్ బాస్ తర్వాత శివాజీకి వెబ్ సిరీస్ రూపంలో మరో హిట్ దక్కింది. ప్రస్తుతం వెకేషన్ మోడ్ లో ఉన్నాడు.

  • Published Jan 13, 2024 | 9:20 PMUpdated Jan 13, 2024 | 9:20 PM
Actor Shivaji: శివాజీ సంచలన వ్యాఖ్యలు.. అవి ప్రూవ్ చేస్తే చచ్చిపోతానంటూ..

శివాజీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 తర్వాత బుల్లితెర ప్రక్షకులకు కూడా సుపరిచితులు అయిపోయారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ హిట్ట కావడం మాత్రమే కాకుండా.. తాను నటించి #90’s వెబ్ సిరీస్ కూడా హిట్టు కొట్టడంతో శివాజీ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ సందర్భంగా వెకేషన్ మూడ్ ని ఎంజాయ్ చేస్తున్న శివాజీ ఓ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్, పాలిటిక్స్, తనపై వచ్చే విమర్శలు, ఆరోపణలు అన్నింటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో టాప్ 3గా బయటకు వచ్చిన శివాజీకి బయట బుల్లితెర ప్రేక్షకుల్లో కాస్త ఫాలోయింగ్ పెరిగిందనే చెప్పాలి. అదే సమయంలో తాను నటించిన వెబ్ సిరీస్ కూడా విడుదల కావడంతో అది కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ ని శివాజీ ఎంజాయ్ చేస్తున్నాడు. సినిమా ఆఫర్లు కాకుండానే, వెబ్ సిరీస్ ఆఫర్స్ కూడా వస్తున్నాయని చెబుతున్నారు. ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో ఎవరికీ తెలీదు. కాబట్టి నేను చెప్పేది ఒక్కటే డబ్బు మిమ్మల్ని ఏ తీరాలకు చేర్చదంటూ కామెంట్స్ చేశాడు. పాలిటిక్స్ వల్ల కెరీర్ నాశనం చేసుకున్నారా అని ప్రశ్నించగా.. నేను ఎవడిని అస్సలు? చొక్కా ప్యాంట్ తో నేను ఇండస్ట్రీకి వచ్చినోడిని. నాకు ఎందులోనూ రిగ్రెట్స్ లేవు అంటూ సమాధానం చెప్పాడు.

రాజకీయాల్లోకి వెళ్లాక బాగా సంపాదించారు అనే ప్రస్నకు శివజీ కాస్త సీరియస్ అయ్యాడు. నేను ఏ పార్టీ దగ్గరైనా చేయి చాచని నిరూపిస్తే ఇప్పుడే చచ్చిపోతానంటూ సమాధానం చెప్పాడు. అన్నింటికనంటే తనకు తన క్యారెక్టర్ ముఖ్యం అంటూ సమాధానం చెప్పాడు. తనకు సంబంధించిన వీడియోలు, థంబ్స్ కి సంబంధించి కూడా శివాజీ కామెంట్స్ చేశాడు. ఓ యూట్యూబర్ పై ఫైర్ కూడా అయ్యాడు. మరోవైపు తనపై వచ్చిన విమర్శలు, పుకార్లకపై కూడా స్పందించాడు. తనకు వివాహమై కూతురు కూడా ఉందని వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. తన లైఫ్ అందరికీ తెలుసని.. అవన్నీ కేవలం వ్యూస్ కోసం చేసినవి మాత్రమే అంటూ కొట్టిపారేశారు. అలాగే బిగ్ బాస్ కి సంబంధించి కూడా శివాజీ కొన్ని కామెంట్స్ చేశాడు. తాను 12వ వారం వరకు టైటిల్ రేసులో ఉన్నాను అన్నాడు. అయితే ఆ తర్వాతే ఏదో తేడా కొట్టిందంటూ చెప్పుకొచ్చాడు. తనను నెగిటివ్ చేసేలా కొన్ని ఎపిసోడ్స్ వచ్చాయంటూ చెప్పుకొచ్చాడు. అమర్ ని కామెంట్స్ చేయడంపై కూడా రియాక్ట్ అయ్యాడు. అమర్ ని చనువుగా కామెంట్స్ చేయడం.. వాళ్ల బాడింగ్ కు నిదర్శనం అంటూ చెప్పుకొచ్చాడు. మరి.. మూవీస్, పాలిటిక్స్, బిగ్ బాస్ పై శివాజీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş