iDreamPost
android-app
ios-app

విష్ణు మాస్టర్ ప్లాన్.. కన్నప్ప కోసం మరో సూపర్ స్టార్!

  • Author Soma Sekhar Updated - 11:59 AM, Fri - 3 November 23
  • Author Soma Sekhar Updated - 11:59 AM, Fri - 3 November 23
విష్ణు మాస్టర్ ప్లాన్.. కన్నప్ప కోసం మరో సూపర్ స్టార్!

భక్త కన్నప్ప.. టాలీవుడ్ తో పాటుగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్ హైప్ ను క్రియేట్ చేస్తున్న సినిమా. మంచు విష్ణు హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి బాలీవుడ్ టెలివిజన్ రంగంలో సూపర్ హిట్ గా నిలిచిన మహాభారత సిరీస్ ను డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో అవా ఎంటర్ టైన్ మెంట్ తో కలిసి 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో భక్త కన్నప్పను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా మెుదలైనప్పటి నుంచి క్రేజీ క్యాస్టింగ్ అప్డేట్స్ తో అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తూ వస్తూనే ఉంది. తాజాగా కన్నప్ప మూవీ కోసం మరో సూపర్ స్టార్ ను బరిలోకి దింపుతున్నాడు మంచు విష్ణు.

భక్త కన్నప్ప.. దివంగత నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా తెరకెక్కిన కల్ట్ క్లాసిక్ మూవీ. ఈ సినిమాను తిరిగి వెండితెరపైకి తీసుకురావడానికి ఎంతో మంది డైరెక్టర్లు, నిర్మాతలు ట్రై చేశారు. కానీ కుదరలేదు. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత మంచు విష్ణు భక్త కన్నప్పను తెరకెక్కించడానికి పూనుకున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది చిత్ర యూనిట్. ఇక సినిమాలో నటించే నటీ, నటులను ఒక్కొక్కరిగా పరిచయం చేస్తూ.. సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేస్తున్నారు మంచు వారి అబ్బాయి. ఇప్పటికే కన్నప్ప కోసం ప్రభాస్, నయనతారను రంగంలోకి దించాడన్న వార్తలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అదీకాక మరో స్టార్ హీరో అయిన మోహన్ లాల్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోసిస్తున్నారు.

తాజాగా ఈ భారీ ప్రాజెక్ట్ లోకి కన్నడ సూపర్ స్టార్ వచ్చి చేరినట్లు సమాచారం. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. భక్త కన్నప్పలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారట. కన్నడలోనే కాక ఇతర ఇండస్ట్రీల్లో శివరాజ్ కుమార్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. మంచు విష్ణు మాస్టర్ ప్లాన్ కు షాకవుతున్నారు అభిమానులు. విష్ణు ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక ఈ మూవీ మెుత్తం న్యూజిలాండ్ లో జరగనుందని, సింగిల్ షెడ్యూల్ లోనే షూటింగ్ మెుత్తం కంప్లీట్ చేస్తామని విష్ణు గతంలోనే తెలిపారు. మరి భక్త కన్నప్పలో శివరాజ్ కుమార్ నటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişrekabet girişgrandpashabet