iDreamPost
android-app
ios-app

ప్రభాస్ తో ఫస్ట్ టైమ్.. ‘కల్కి’లో మరో స్టార్ యాక్టర్!

  • Published Mar 01, 2024 | 11:40 AM Updated Updated Mar 01, 2024 | 11:40 AM

Prabhas, Kalki 2898 AD: కల్కి మూవీలో మరో స్టార్ యాక్టర్ నటించబోతున్నాడని తెలుస్తోంది. అయితే అతడు ప్రభాస్ తో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. మరి ఆ యాక్టర్ ఎవరు? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Prabhas, Kalki 2898 AD: కల్కి మూవీలో మరో స్టార్ యాక్టర్ నటించబోతున్నాడని తెలుస్తోంది. అయితే అతడు ప్రభాస్ తో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. మరి ఆ యాక్టర్ ఎవరు? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

  • Published Mar 01, 2024 | 11:40 AMUpdated Mar 01, 2024 | 11:40 AM
ప్రభాస్ తో ఫస్ట్ టైమ్.. ‘కల్కి’లో మరో స్టార్ యాక్టర్!

‘కల్కి’ 2898 AD.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ. ఇక ఈ చిత్రం ప్రారంభమైన దగ్గర నుంచి రోజుకో అప్డేట్ ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తోంది. ఇక ఈ మూవీలో ఇప్పటికే బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ లాంటి భారీ తారాగాణం మూవీలో భాగమైయ్యారు. అదీకాక క్యామియో రోల్స్ లో నాని, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కనిపిస్తారన్న న్యూస్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా మరో స్టార్ నటుడు ఈ మూవీలో నటించనున్నాడట. అతడు ప్రభాస్ తో స్క్రీన్ పంచుకోవడం ఇదే ఫస్ట్ టైమ్. మరి ఆ యాక్టర్ ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కల్కి మూవీ క్యాస్టింగ్ చూస్తే.. కళ్లు బైర్లుకమ్మడం ఖాయమే. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రభాస్, బిగ్ బి, కమల్ హాసన్, దీపికా లాంటి భారీ క్యాస్టింగ్ తో రానున్న ఈ మూవీ.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా మే 9న బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో కల్కి సినిమాలో మరో స్టార్ యాక్టర్ యాడ్ అయ్యాడన్న వార్త వైరల్ గా మారింది.

సీనియర్ యాక్టర్ రాజేంద్రప్రసాద్ కల్కిలో కీలక పాత్ర చేయబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి రాజేంద్రప్రసాదే హింట్ ఇచ్చాడు. ‘కలియుగ పట్నం’ మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ లో ప్రభాస్ తో తొలిసారి నటించబోతున్నాను అని హింట్ ఇచ్చాడు. దీంతో కల్కిలో రాజేంద్రప్రసాద్ కూడా కనిపించబోతున్నాడు అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో 10 రోజుల షూటింగ్ షెడ్యూల్ జరుగుతోంది.

ఇంకోవైపు గ్రాఫిక్స్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. మూవీని అనుకున్న టైమ్ కు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో కల్కి తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్ర ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కాగా.. దీపిక ప్రెగ్నెన్సీతో కల్కి మూవీ షూటింగ్ కు బ్రేక్ పడుతుందా? అని ప్రభాస్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. కానీ ఆమె పార్ట్ షూటింగ్ పూర్తైందని, కేవలం డబ్బింగ్ మాత్రమే ఉందని తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. మరి కల్కిలోకి మరోస్టార్ రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Bhoothaddam Bhaskar Narayana Review Telugu: భూతద్దం భాస్కర్‌ నారాయణ సినిమా రివ్యూ.. ఎలా ఉందంటే

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbaywin girişgrandpashabet