P Krishna
Jail Sentence for Famous Actor: ఈ మద్య కాలంలో మహిళలపై లైంగిక వేధింపులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా నిత్యం ఎక్కడో అక్కడ ఈ దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
Jail Sentence for Famous Actor: ఈ మద్య కాలంలో మహిళలపై లైంగిక వేధింపులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా నిత్యం ఎక్కడో అక్కడ ఈ దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
P Krishna
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో ఎక్కడో అక్కడ మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతనే ఉంది. ఒంటరిగా మహిళల కనిపిస్తే చాలు వయసు తో సంబంధం లేకుండా లైంగిక వేధింపులకు పాల్పపడుతున్నా కొందరు మృగాళ్లు. కొంతమంది దుర్మార్గులు తమ గుట్టు బయట పడుతుందన్న భయంతో హత్యలకు పాల్పపడుతున్నారు. సామాన్యులే కాదు ఇటీవల కొంతమంది సెలబ్రెటీలు కూడా లైంగిక వేధింపులకు పాల్పపడుతూ పోలీసులకు చిక్కుతున్నారు. ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పపడినందుకు నటుడికి జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే..
రెండేళ్ల క్రితం ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సీరీస్ సోషల్ మీడియాలో దుమ్మురేపింది. ఈ వెబ్ సీరీజ్ రిలీజ్ అయిన 90 దేశాల్లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇప్పటికీ నెట్ ఫ్లిక్స్ లో తక్కువ సమయంలో ఎక్కువగా వీక్షించిన వెబ్ సీరీస్ లో ఒకటిగా స్క్విడ్ గేమ్ నిలుస్తుంది. స్క్విడ్ గేమ్ వెబ్ సీరీస్ లో కీలక పాత్రలో కనిపించిన నటుడు ఓ యోంగ్ పై తాజాగా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయ. 2017 లో వచ్చిన అభియోగాలపై 79 వయసులో ఈ నటుడికి దక్షిణ కొరియా కోర్టు శిక్ష విధించింది. స్క్విడ్ గేమ్ వెబ్ సీరీస్ హిట్ కావడంతో ఈ మధ్య సీజన్ 2 పై ఓ వీడియో ద్వారా మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఓ యోంగ్ సు (79) పై లైంగిక వేధింపు కేసులో సువాన్ జిల్లా కోర్టు సియోంగ్నామ్ శాఖ ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది.
సినీ రంగంలో రెండేళ్ల పాటు నిషేదం కూడా విధించింది. గతంలో ఆయనపై మరో లైంగిక వేధింపు కేసు ఉంది. 2017 లో ఓ గ్రామంలో ధియేటర్ ప్రదర్శనకు కోసం వెళ్లిన సమయంలో ఈ దుశ్చర్యకు పాల్పపడినట్లు వార్తలు వచ్చాయి. అక్కడ ఓ సరస్సు దాటేందుకు మహిళ సహాయం అడగా ఆమె చేయి పట్టుకున్నట్లు యోంగ్ చెబుతున్నాడు. అంతేకాదు ఆ ఘటన జరిగిన తర్వాత ఆమెకు క్షమాపణలు కూడా చెప్పినప్పటికీ తనపై లైంగిక కేసు నమోదు అయిందని అంటున్నారు. 50 ఏళ్లుగా ఆయన ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. స్క్విడ్ గేమ్ వెబ్ సీరీస్ తో బాగా పాపులర్ అయ్యారు. తప్పు చేస్తే ఎలాంటి వారికైనా శిక్ష తప్పదని నెటిజన్లు అంటున్నారు.