iDreamPost
android-app
ios-app

రాజమౌళి మాస్టర్ ప్లాన్.. మహేశ్ కు స్టార్ యాక్టర్ తో క్లాసులు!

  • Published Jul 08, 2024 | 5:11 PM Updated Updated Jul 08, 2024 | 5:11 PM

Special Workshops For Mahesh Babu For Rajamouli Project: రాజమౌళి ప్రాజెక్ట్ పై మహేశ్ బాబు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి స్పెషల్ వర్క్ షాప్స్ కు కూడా అటెండ్ అవుతున్నట్లు చెబుతున్నారు.

Special Workshops For Mahesh Babu For Rajamouli Project: రాజమౌళి ప్రాజెక్ట్ పై మహేశ్ బాబు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి స్పెషల్ వర్క్ షాప్స్ కు కూడా అటెండ్ అవుతున్నట్లు చెబుతున్నారు.

  • Published Jul 08, 2024 | 5:11 PMUpdated Jul 08, 2024 | 5:11 PM
రాజమౌళి మాస్టర్ ప్లాన్.. మహేశ్ కు స్టార్ యాక్టర్ తో క్లాసులు!

ప్రస్తుతం థియేటర్లలో కల్కి 2898 ఏడీ సినిమా హడావుడి నడుస్తోంది. ఈ మూవీ ప్రస్తుంత పాన్ వరల్డ్ స్థాయిలో తన సత్తా చాటుతోంది. ఇప్పటికే రూ.900 కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయింది. అయితే ఈ మూవీ తర్వాత ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్న.. ఎదురుచూస్తున్న పాన్ వరల్డ్ మూవీ ఏదైనా ఉందా అంటే అది కచ్చితంగా రాజమౌళి- మహేశ్ బాబు ప్రాజెక్ట్ అనే చెప్పాలి. అయితే ఆ మూవీ ఇంకా ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఎలాంటి అప్ డేట్ రావడం లేదు అని డీలా పడుతున్న మహేశ్ ఫ్యాన్స్ కోసం ఒక క్రేజీ న్యూస్ వచ్చేసింది. ప్రస్తుతం మహేశ్ బాబు స్పెషల్ క్లాసెస్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక స్టార్ యాక్టర్ ని మహేశ్ కు ట్యూటర్ గా పెట్టారు అంటున్నారు.

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ప్రస్తుతం సినిమా మూడ్ లో లేరు. ఎందుకంటే తమ అభిమాన నటుడి సినిమా వెండితెర మీదకు రావాలి అంటే కనీసం ఇంకో నాలుగేళ్లు ఆగాల్సిందే. అందుకే వాళ్లు కూడా మూవీస్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు లేరు. కానీ, వాళ్ల అభిమాన హీరో సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక క్రేజీ వార్త అయితే నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ అప్ డేట్ చూసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ అప్ డేట్ చూస్తే త్వరలోనే రాజమౌళి- మహేశ్ బాబు ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కుతుందని అనిపిస్తోంది. ఒక స్టార్ యాక్టర్ తో రాజమౌళి తన ప్రాజెక్ట్ కోసం మహేశ్ బాబుకు స్పెషల్ క్లాసులు చెప్పిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మహేశ్ కోసం నియమించిన ఆ ట్యూటర్ మరెవరో కాదు.. నాజర్ అని చెప్తున్నారు. రాజమౌళితో బాహుబలి కోసం సుదీర్ఘ ప్రయాణం చేసిన అనుభవం నాజర్ కు ఉంది. అలాగే మహేశ్ తో కూడా నాజర్ కు మంచి వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ఉంది. ప్రస్తుతం రాజమౌళి ప్రాజెక్ట్ కోసం మహేశ్ బాబు వర్క్ షాప్స్ కి అటెండ్ అవుతున్నాడని చెబుతున్నారు. వాటిలో మహేశ్ బాబు డైలాగ్ డెలివరీ, కొంత కొత్త పదాలు, భాష, సంస్కృతులకు సంబంధించి స్పెషల్ గా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ఎప్పుడు పట్టాలు ఎక్కుతుంది అనే సమాచారం అయితే లేదు.

కానీ, త్వరలోనే రెగ్యూలర్ షూట్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది అని మాత్రం చెప్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కథ ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని ఊహాగానాలు ఉన్న మాట వాస్తవమే. ఇప్పుడు ఈ వార్తను బట్టి చూస్తే ఈ మూవీలో కొత్తరకం భాష కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే అడవుల నేపథ్యం కాబట్టి కచ్చితంగా ఏదైనా ట్రైబ్ కు రిలేటెడ్ గా సీన్స్ ఉండే ఆస్కారం లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి స్పెషల్ ఫోకస్ పెట్టి ఉండచ్చు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom