iDreamPost
android-app
ios-app

ప్రముఖ నటుడికి ఛాతీ నొప్పి.. ఆస్పత్రికి చేరిక!

  • Published Apr 17, 2024 | 5:55 PM Updated Updated Apr 17, 2024 | 5:55 PM

Mansoor Ali Khan Hospitalized: తమిళ, తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించిన మన్సూర్ అలీఖాన్ ఇటీవల తరుచూ కాంట్రవర్సీ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.

Mansoor Ali Khan Hospitalized: తమిళ, తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించిన మన్సూర్ అలీఖాన్ ఇటీవల తరుచూ కాంట్రవర్సీ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.

  • Published Apr 17, 2024 | 5:55 PMUpdated Apr 17, 2024 | 5:55 PM
ప్రముఖ నటుడికి ఛాతీ నొప్పి.. ఆస్పత్రికి చేరిక!

సంచలన నటుడు మన్సూర్ అలీఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు.ఇటీవల ఆయన పేరు సోషల్ మీడియాలో తరుచూ వినిపిస్తుంది. కెరీర్ బిగినింగ్ లో విలన్ గా నటించిన ఆయన ఇటీవల కమెడియన్ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు.  ఆ మధ్య స్టార్ హీరోయిన్ త్రిష పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. చాలా మంది నటీనటులు త్రిషకు సపోర్ట్ చేయడంతో మన్సూర్ చట్టపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఆ తర్వాత త్రిషపై ఓ రాజకీయ నేత చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా త్రిషకు సపోర్ట్ గా నిలిచారు మన్సూర్ అలీ‌ఖాన్. ప్రస్తుతం ఆయన లోక్ సభ సభ్యులుగా పోటీ చేస్తూ ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ఛాతి నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు మన్సూర్ అలీఖాన్ ప్రస్తుతం సినిమాకు విరామం ఇచ్చి రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. ప్రస్తుతం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన విరామం లేకుండా ప్రచారంలో పాల్గొంటున్నారు. ‘ఇండియా జననాయక పులిగళ్ పార్టీ’ ని స్థాపించిన ఆయన పార్టీ ఎగ్జిక్యూటీవ్ కమిటీ అనుమతి లేకుండా ఏఐఏడీఎమ్‌కే పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించారని ఆయనపై అభియోగం రావడవంతో పార్టీ నుంచి మన్సూర్ ని తొలగించారు. ప్రస్తుతం ఆయన వేలూరు లోక్ సభ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ కంటిన్యూగా ప్రచారంలో మునిగిపోయారు.

నిత్యం ప్రజతో మమేకం అవుతూ.. వారి కష్టాలు గురించి అడిగి తెలుసుకుంటూ ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా ఎన్నికల్లో ప్రచారం కొనసాగించడంతో ఒక్కసారిగా ఆయనకు ఛాతి నొప్పి రావడంతో స్పృహకోల్పోయారు. ఆయన వెంట ఉన్న వాలంటీర్లు వెంటనే గడియాతం ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. వైద్యులు మన్సూర్ ని పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. ఆయన హెల్త్ కండీషన్ ఎలా ఉందో తెలియాల్సి ఉంది. గత కొంత కాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మన్సూర్ అలీఖాన్ ఇటీవల ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నారు. మరోవైను తమ అభిమాన నాయకుడికి ఏం జరిగిందని ఆందోళన చెందుతున్నారు కార్యకర్తలు, అభిమానులు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobet