iDreamPost
android-app
ios-app

తమన్నా ‘కావాలయ్యా’ సాంగ్‌పై నటుడి అసభ్య కామెంట్లు!

దీంతో ఆయన ఆగ్రహానికి గురయ్యారు. శనివారం  చెన్నైలో ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా..

దీంతో ఆయన ఆగ్రహానికి గురయ్యారు. శనివారం  చెన్నైలో ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా..

తమన్నా ‘కావాలయ్యా’ సాంగ్‌పై నటుడి అసభ్య కామెంట్లు!

నటుడు మన్సుర్‌ అలీ ఖాన్‌ జైలర్‌ సినిమాలో తమన్నా ఆడిన ‘ కావాలయ్యా!’ సాంగ్‌పై సంచలన కామెంట్లు చేశారు. ఆ పాటలో తమన్నా మూమెంట్లు అసభ్యకరంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. ఆయన కూడా తమన్నా సాంగ్‌పై అసభ్యంగా మాట్లాడారు. అలాంటి పాటకు సెన్సార్‌ బోర్డు ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు. మన్సుర్‌ అలీ ఖాన్‌ మాట్లాడుతూ.. ‘‘ కావాలా? అనే ఓ పాటలో.. చాలా దారుణంగా తమన్నా చెయ్యిని కాళ్లలో మధ్య ఉంచుతూ డ్యాన్స్‌ చేస్తుంది. కావాలా? రా! అని చూపించారు.

ఆ విధంగా నేను సెక్సీగా తీయలేదు కదా.. వాళ్లు అడగటం లేదు. అడగరు. అది చాలా దారుణమైన మూమెంట్‌’’ అని అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్లకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాతో పాటు సినీ సర్కిల్‌లోనూ వైరల్‌గా మారింది. మన్సుర్‌ సెన్సార్‌ బోర్డుపై.. తమన్నా ‘కావాలయ్యా!’ పాటపై విమర్శలు చేయడానికి ఓ కారణం ఉంది. ఆయన తీసిన ‘ సరకు’ అనే సినిమాలోని పలు సన్ని వేశాలకు సెన్సార్‌ బోర్డు కట్టు పెట్టింది. పలు సన్ని వేశాల్ని మార్చాలని కూడా ఆదేశించింది.

దీంతో ఆయన ఆగ్రహానికి గురయ్యారు. శనివారం  చెన్నైలో ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సెన్సార్‌ బోర్డుపై మండిపాటు వ్యక్తం చేశారు. కాగా, జైలర్‌ సినిమాలో ‘కావాలయ్యా!’ సాంగ్‌ ఈ సంవత్సరంలో పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ పాటను సింగర్‌ శిల్పారావ్‌ పాడగా.. తమన్నా డ్యాన్స్‌ చేశారు. తమిళ రచయిత అరుణ్‌ రాజా కామరాజ్‌ ఈ పాటకు లిరిక్స్‌ అందించారు. మరి, జైలర్‌ సినిమాలో తమన్నా ఆడిన ‘ కావాలయ్యా!’ సాంగ్‌పై నటుడు మన్సుర్‌ అలీ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి