iDreamPost
android-app
ios-app

ట్రోలింగ్ తో ఆ హీరోపై రాళ్లేశారు! అతను వాటితో ఇల్లే కట్టేశాడు!

ట్రోలింగ్ తో ఆ హీరోపై రాళ్లేశారు! అతను వాటితో ఇల్లే కట్టేశాడు!

ఎలాంటి ఫిల్మ్‌ బ్యాంగ్రౌండ్‌ లేకుండానే తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా రాణిస్తున్నారు ‘కిరణ్‌ అబ్బవరం’. 2015లో షార్ట్‌ ఫిల్మ్‌లతో యాక్టింగ్‌ కెరీర్‌ ప్రారంభించిన ఆయన నాలుగేళ్లకే హీరోగా మారారు. అంకిత భావం, ప్యాషన్‌, పట్టుదల ఉంటే ఎవరు.. ఏదైనా సాధించొచ్చని నిరూపించారు. 2019లో వచ్చిన ‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోగా మారారు. ‘‘ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం’’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రతీ సంవత్సరం రెండు, మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉన్నారు. అయితే, ప్రతీ సినిమా విడుదల సమయంలో కొంతమంది కావాలని ఆయనపై విమర్శలు చేస్తూ వస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ఓ వర్గం కిరణ్‌ అబ్బవరాన్ని టార్గెట్‌ చేసింది. పని గట్టుకుని ఆయనపై ట్రోలింగ్స్‌ చేస్తోంది. కిరణ్‌ అబ్బవరం తన సోషల్‌ మీడియా ఖాతాలో పెట్టే ప్రతీ పోస్టుపై కొంతమంది ట్రోలింగ్స్‌ చేస్తూ వస్తున్నారు. 2023, ఆగస్టు 18న ఆయన సెటిల్‌ బ్యాట్‌తో ఓ ఫోజ్‌ పెట్టగా.. దానికి ఓ నెటిజన్‌ ‘‘ అచ్చం హీరోలా ఉన్నావ్‌’అంటూ వ్యంగంగా కామెంట్‌ పెట్టాడు. తర్వాత ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా టైంలో.. కిరణ్‌ తన మీద వస్తున్న ట్రోలింగ్స్‌ గురించి చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి పూణె నుంచి తనకు అసభ్యంగా మెసేజ్‌ పెడుతున్నాడని అన్నారు.

ట్విటర్‌లో వేదికగా తను దారుణంగా తిడుతున్నారంటూ కంటతడి సైతం పెట్టుకున్నారు. బాగా లేని సినిమాలకు.. బాగా ఉన్న సినిమాలకు తేడా లేకుండా తిడుతున్నారని అన్నారు. మీటర్‌ సినిమా సమయంలోనూ ‘ నయా పవర్‌ స్టార్‌’ అంటూ  ఓ ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం కారణంగా కిరణ్‌పై ఎదురు దాడి పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన  ఆ ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు.  అదంతా ఫేక్‌ అని స్పష్టం చేశారు. తర్వాత ప్రభాస్‌ విషయంలోనూ ఇదే జరిగింది. అప్పుడు కూడా ఆయన క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

ఇలా ప్రతీ విషయంలో ఓ బ్యాచ్‌ కిరణ్‌ అబ్బవరాన్ని టార్గెట్‌ చేసి ట్రోలింగ్స్‌ చేస్తూ వస్తోంది. కానీ, ఆయన మాత్రం ఎంతో అసహనంగా ముందుకు వెళుతూ ఉన్నారు. ఏనుగు వెళ్లేటప్పుడు కుక్కలు మొరుగుతాయి అన్న చందాన తన పని తాను చూసుకుంటూ వస్తున్నారు. తనపై వేసిన రాళ్లతోనే ఓ అందమైన ఇంటిని నిర్మించుకున్నారు. తాజాగా, ఆయన తన కొత్తింటి కోసం గృహ ప్రవేశ కార్యకమం నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis