iDreamPost
android-app
ios-app

పెళ్లికి సిద్ధమైన ఈ కుర్రాడు.. ఓ స్టార్ యాక్టర్ కొడుకు..ఎవరంటే..?

  • Published Nov 11, 2023 | 2:58 PM Updated Updated Nov 11, 2023 | 2:58 PM

పరిశ్రమలో వరుసగా భాజా భజంత్రీలు మోగుతున్నాయి. బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా, కోలీవుడ్ స్టార్ నటుడు అశోక్ సెల్వన్, టాలీవుడ్ మెగా వారసుడు వరుణ్ తేజ్.. ఓ ఇంటి వారయ్యారు. వీరందరికీ కూడా ప్రేమ వివాహం కావడమే విశేషం. ఇప్పుడు ఓ స్టార్ హీరో కొడుకు పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు.

పరిశ్రమలో వరుసగా భాజా భజంత్రీలు మోగుతున్నాయి. బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా, కోలీవుడ్ స్టార్ నటుడు అశోక్ సెల్వన్, టాలీవుడ్ మెగా వారసుడు వరుణ్ తేజ్.. ఓ ఇంటి వారయ్యారు. వీరందరికీ కూడా ప్రేమ వివాహం కావడమే విశేషం. ఇప్పుడు ఓ స్టార్ హీరో కొడుకు పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు.

  • Published Nov 11, 2023 | 2:58 PMUpdated Nov 11, 2023 | 2:58 PM
పెళ్లికి సిద్ధమైన ఈ కుర్రాడు.. ఓ స్టార్ యాక్టర్ కొడుకు..ఎవరంటే..?

మూవీ ఇండస్ట్రీలో యంగ్ స్టార్స్ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా ఆప్ ఎంపీని రాజీవ్ చద్దాను వివాహం చేసుకున్న సంగతి విదితమే. ఈ సమయంలో టాలీవుడ్ ప్రేమ పక్షులు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు ఇటలీలో వెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుని.. ఇండియా వచ్చి గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అంతకముందు కోలీవుడ్ స్టార్ నటుడు అశోక్ సెల్వన్ కూడా కీర్తి పాండియన్ మెడలో మూడు ముళ్లు వేశాడు. తెలుగు,కన్నడలో ఒకప్పటి స్టార్ హీరో అర్జున్ సర్జా పెద్ద కుమార్తె, నటి ఐశ్వర్య అర్జున్.. తమిళ స్టార్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతిని ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. అలాగే ఒకప్పటి అగ్ర నటి రాధ కుమార్తె, నటి కార్తీక కూడా తర్వలో పెళ్లి  పీటలు ఎక్కబోతోంది.

ఈ క్రమంలో మరో జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది.  మలయాళ స్టార్ నటుడు జయరామ్ తనయుడు కాళీదాస్ జయరామ్.. మోడల్ తరిణి కళింగరాయర్ ను నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కాళీదాస్..తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తున్నాడు. తమిళనాడుకు చెందిన తరిణి.. 2021 మిస్ యూనివర్స్ ఇండియాలో 3వ రన్నరప్ గా టైటిల్‌ను గెలుచుకుంది. ప్రస్తుతం ఆమె మోడల్‌గా రాణిస్తోంది. చెన్నైలో ఓ అవార్డు ఫంక్షన్ లో ఆమె గురించి, బహిరంగంగా చెప్పాడు కాళీదాస్. అయితే ఈ జంట తమ నిశ్చితార్థ విషయాన్ని రహస్యంగా ఉంచారు. ఆ తర్వాత వీడియోను, ఫోటోలను విడుదల చేశారు.

మలయాళ స్టార్ నటుడైన జయరామ్ పలు తెలుగు సినిమాల్లో కనిపిస్తున్న సంగతి విదితమే. భాగమతి సినిమా ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ దిగ్గజ నటుడు.. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ అసలైన తండ్రి పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత రాథే శ్యామ్, ధమాకా, రవాణాసుర, ఖుషి వంటి చిత్రాల్లో నటించారు. మలయాళ పరిశ్రమనే కాకుండా.. తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేస్తూ బిజీ ఆర్టిస్టుగా మారారు. సుమారు ఆయన 200 సినిమాల్లో హీరోగా చేశారు. తన తండ్రి  నుండి నటనను వారసత్వంగా తీసుకున్న కుమారుడు కాళిదాస్ కూడా.. స్టార్ హీరోగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Kalidas Jayaram (@kalidas_jayaram)

 

View this post on Instagram

 

A post shared by Kalidas Jayaram (@kalidas_jayaram)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio