iDreamPost
android-app
ios-app

నడిరోడ్డుపై కుప్పకూలిన వ్యక్తి.. CPR చేసి బతికించిన నటుడు

  • Published Oct 06, 2023 | 6:02 PM Updated Updated Oct 06, 2023 | 6:02 PM
నడిరోడ్డుపై కుప్పకూలిన వ్యక్తి.. CPR చేసి బతికించిన నటుడు

ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా చిన్న పిల్లల పెద్ద వయసు వాళ్లు హార్ట్ ఎటాక్ తో కన్నుమూస్తున్నారు. అధికంగా వ్యాయామం చేస్తూ, డ్యాన్సులు చేస్తూ.. రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్నవారు హఠాత్తుగా కుప్పకూలిపోతున్నారు. గుండెపోటుతో కన్నుమూస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి రోడ్డు పక్కన కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న బాలీవుడ్ నటుడు అతనికి సీపీఆర్ చేసి కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ మద్య కొంతమంది హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. ఆసుపత్రికి తరలించేలోపు చనిపోతున్నారు. గుండెపోటు తో కుప్పకూలిపోయిన వ్యక్తులను సరైన సమయంలో సీపీఆర్ (కార్డియో పల్మోనరీ రిససిటేషన్) చేసినట్లయితే చాలా వరకు బతికే ఛాన్సు ఉంది.. అలా ఎంతో మంది బతికి బయటపడ్డారు. ఓ వ్యక్తి రోడ్డు పక్కన హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. అటుగా వెళ్తున్న టీవీ, సినీ నటుడు గుర్మిత్ చౌదర్ అది గమనించి వెంటనే అక్కడికి చేరుకొని ఆ వ్యక్తికి సీపీఆర్ చేసి బతికించాడు. తర్వాత ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.

సెలబ్రెటీ హూదాలో ఉన్నప్పటికీ ఓ సామాన్యుడి ప్రాణాలు కాపాడటానికి ముందుకు వచ్చిన నటుడు గుర్మిత్ చౌదరిపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాంటి సమయంలో సమయస్ఫూర్తి కావాలని.. దేవుడిలా వచ్చి బాధితుడిని రక్షించి గొప్ప మనసు చాటుకున్నాడని.. నిజంగా అసలైన హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే గుర్మిత్ చౌదరి తనకు సంబంధించిన వీడియోలు, పోటోలు సోషల్ అభిమానులతో పంచుకుంటారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.