iDreamPost
android-app
ios-app

రేణుకాస్వామి మర్డర్ కేసు.. దర్శన్ కి మరో షాక్! ఏంటేంటే?

  • Published Jul 19, 2024 | 11:18 AM Updated Updated Jul 19, 2024 | 11:18 AM

Actor Darshan: బెంగుళూరు చిత్ర దుర్గకు చెందిన రేణుకా స్వామి అనే వ్యక్తిని ప్రముఖ కన్నడ హీరో దర్శన్ తుగదీప్ అతని ప్రియురాలు పవిత్ర గౌడ హత్య చేయించిన కేసులో పరప్పన అగ్రహార జైలుకు తరలించిన విషయం తెలిసిందే.

Actor Darshan: బెంగుళూరు చిత్ర దుర్గకు చెందిన రేణుకా స్వామి అనే వ్యక్తిని ప్రముఖ కన్నడ హీరో దర్శన్ తుగదీప్ అతని ప్రియురాలు పవిత్ర గౌడ హత్య చేయించిన కేసులో పరప్పన అగ్రహార జైలుకు తరలించిన విషయం తెలిసిందే.

  • Published Jul 19, 2024 | 11:18 AMUpdated Jul 19, 2024 | 11:18 AM
రేణుకాస్వామి మర్డర్ కేసు.. దర్శన్ కి మరో షాక్! ఏంటేంటే?

కన్నడ ఇండస్ట్రీలో ఛాలెంజింగ్ హీరో దర్శన్ తుగదీప్ కి ఎంతో మాస్ ఫాలోయింగ్ ఉంది. చిన్న చిన్న పాత్రల్లో నటించిన దర్శన్ తర్వాత హీరోగా మారారు. కన్నడ నాట ఎంతో క్రేజ్ ఉన్న దర్శన్ తన ప్రియురాలు పవిత్ర గౌడకు రేణుకా స్వామి అనే ఫ్యాన్ తరుచూ అసభ్య మెజేజ్, వీడియోలు పెడుతున్నాడన్న కోపంతో కొంతమందికి సుపారీ కిడ్నాప్ చేయించి తర్వాత దారుణంగా హత్య చేయించాడు. ఆ హత్య సమయంలో దర్శన్, పవిత్ర గౌడ కూడా ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించడంతో దర్శన్, పవిత్ర గౌడతో పాటు మొత్తం 17 మందిని జ్యూడిషియల్ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ కి మరో షాక్ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

బెంగుళూరులోని చిత్ర దుర్గకు చెందిన రేణుకా స్వామిని దారుణ హత్యకు గురయ్యాడు. మొదట ఇది మామూలు కేసుగా భావించా.. తర్వాత ఇందులో ప్రముఖ స్టార్ హీరో దర్శన్ తుగదీప్ అతని ప్రియురాలు పవిత్ర గౌడ ప్రమేయం ఉందని తెలియంతో పోలీసులు కేసును సీరియస్ గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే దర్శన్ తో పాటు పవిత్ర గౌడ మరో 17 మందిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకొని పరప్పన అగ్రహార జైలుకు తరలించిన విషయం తెలిసిదే. తాజాగా ఈ కేసులో దర్శన్ కి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు పలు కీలక సాక్ష్యాలు సేకరించారు. నింధితులకు సంబంధించిన ఫింగర్ ప్రింట్ మ్యాచ్ కావడంతో ఈ కేసులో దర్శన్, పవిత్ర ప్రమేయం ఖచ్చితంగా ఉన్నట్లో పోలీసులు అంచనాకు వస్తున్నారు.

ఇదిలా ఉంటే రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ కి మరో షాక్ తగిలింది. దర్శన్ తో పాటు అతని సహచరులకు 14 రోజులపాటు జ్యుడిషియల్ కస్టడీని ఆగస్టు 1వ తేదీ వరకు పొడిగిస్తూ గురువారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మరికొన్ని రోజుల పాటు దర్శన్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఈ కేసు విచారణ నిమిత్తం దర్శన్ తో పాటు ఇతర నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరు పర్చిన తర్వాత 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధాన నిందితుడు దర్శన్ అతని ప్రియురాలు పవిత్ర గౌడను ప్రత్యేక గదిలో కూర్చోబెట్టి విచారణ జరిపించారు. కాగా, రేణుకా స్వామి హత్య కేసులో పవిత్ర గౌడ ఎ1, దర్శన్ ఎ2, పవన్ ఎ3 నిందితులుగా ఉన్నారు.