iDreamPost
android-app
ios-app

ఘనంగా హీరోతో హీరోయిన్ పెళ్లి! వైరల్ అవుతున్న ఫోటోలు!

  • Author ajaykrishna Updated - 01:09 PM, Wed - 13 September 23
  • Author ajaykrishna Updated - 01:09 PM, Wed - 13 September 23
ఘనంగా హీరోతో హీరోయిన్ పెళ్లి! వైరల్ అవుతున్న ఫోటోలు!

ఇండస్ట్రీలో జంట పెళ్లి పీటలెక్కింది. హీరో అశోక్ సెల్వన్.. తనతో పాటే ఓ సినిమా చేస్తున్న హీరోయిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇంతకు ఎవరీ అశోక్ సెల్వన్ అంటారా! తమిళ హీరో అయినప్పటికీ.. తెలుగు, మలయాళం ఇలా డిఫరెంట్ భాషలలో చిన్న చిన్న పాత్రలు కూడా చేస్తుంటాడు. అశోక్ సెల్వన్ తెలుగులో ‘నిన్నిలా నిన్నిలా’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. కానీ.. ఆ సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఆ తర్వాత గతేడాది విశ్వక్ సేన్ నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ మూవీలో హీరోయిన్ లవర్ గా చిన్న రోల్ చేశాడు. వీటితో పాటు పలు తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా కూడా అశోక్ సెల్వన్ తెలుగు ఆడియన్స్ కి సుపరిచితమే.

కట్ చేస్తే.. ఇప్పుడు తనతో పాటే నటిస్తున్న హీరోయిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలిసి ఒక్కసారిగా సర్ప్రైజ్ అవుతున్నారు ఫ్యాన్స్. అందులోనూ ఆ హీరోయిన్ కూడా ఓ సీనియర్ నటుడి కూతురు కావడం విశేషం. ఇంతకీ అశోక్ సెల్వన్ పెళ్ళాడింది ఎవరినో తెలుసా? తమిళ హీరోయిన్ కీర్తి పాండ్యన్. తమిళనాడులోని తిరుణల్వేలిలో.. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో అశోక్, కీర్తిల పెళ్లి ఘనంగా జరిగింది. ఈరోజు ఉదయం వీరిద్దరూ కలిసి వివాహ బంధంలో అడుగుపెడుతూ ఏడడుగులు వేశారు.

ఇక ఈ కీర్తి పాండ్యన్ ఎవరంటే.. తమిళ నటుడు, పొలిటిషన్ అరుణ్ పాండ్యన్ కూతురు. ఇంకా చెప్పాలంటే తమిళ నటి రమ్య పాండ్యన్ కజిన్. అయితే.. ప్రస్తుతం అశోక్, కీర్తిల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఫ్యాన్స్, నెటిజన్స్ నెట్టింట కామెంట్స్ పెడుతూ విష్ చేస్తున్నారు. వీరి లవ్ స్టోరీ ఏంటనే వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘బ్లూ స్టార్’ అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన మొదటి నుండి ఒకరినొకరు పరిచయం చేసుకొని.. కొద్దిరోజులకు లవ్ లో పడ్డారట. అలా ఫ్యామిలీస్ ని ఒప్పించి ఒక్కటయ్యారు ఈ రీల్ జంట. మరి అశోక్ సెల్వన్, కీర్తిల జంట ఎలా ఉందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbabilonbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom