P Krishna
Arulmani Passed away: గత కొంత కాలంగా సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో వారి కుటుంబ సభ్యులే కాదు అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు.
Arulmani Passed away: గత కొంత కాలంగా సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో వారి కుటుంబ సభ్యులే కాదు అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు.
P Krishna
గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నటీనటులు, దర్శక, నిర్మాతలు, సాంకేతిక రంగాని చెందిన వారు కన్నుమూస్తున్నారు. కొంతమంది గుండెపోటు, వయోభారం, రోడ్డు ప్రమాదాలు కారణంగా కన్నుమూస్తున్నారు. మరికొంతమంది కెరీర్ సరిగా లేక ఆర్థిక కష్టాలతో బలవన్మరణాలకు పాల్పపడుతున్నారు. ఏది ఏమైనా సెలబ్రెటీలు కన్నుమూయడం వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం విషాదంలో మునిగిపోతున్నారు. గత నెెల నుంచి వరుస గా సినీ పరిశ్రమకు చెందిన వారు వరుసగా కన్నుమూస్తున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ నటుడు కన్నుమూయడంతో తీవ్ర విషాదం నెలకొంది.
సినీ ఇండస్ట్రీని విషాదాలు వదలడం లేదు. ప్రముఖ కమెడియన్ విశ్వేశ్వర రావు, వీర భద్రరావు గత నెలలో కన్నుమూశారు. డబ్బింగ్ రచయిత శ్రీరామకృష్ణ, కమెడియన్ లక్ష్మీనారాయణ్, విలన్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న డేనియల్ బాలాజీ, బాలీవుడ్ ప్రొడ్యూసర్ గంగు రామ్ సే, ఉగాది పండుగ రోజే మాలీవుడ్ నటుడు సుజిత్ రాజేంద్రన్, రంజాన్ రోజు ఛత్తీస్‌గఢ్ ప్రముఖ నటుడు కమ్ విలన్ సూరజ్ మోహర్ కన్నుమూశారు. ఈ విషాదాలు మరువక ముందే కోలీవుడ్ నటుడు, సింహం ఫేమ్, అన్నాడీఎంకే స్టార్ స్పీకర్ అరుళ్మణి (65) గురువారం రాత్రి చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. అరుళ్మణి తమిళ ఇండస్ట్రీలో వెండితెర, బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.
తమిళనాట బుల్లితెరపై వచ్చిన ‘అళగి’, ‘తేనారల్’ వంటి సీరియల్స్ లో నెగిటీవ్ పాత్రల్లో పోషించి బుల్లితెర ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నారు. నటుడిగానే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంత కాలం అరుళ్మణి దర్శకత్వ శిక్షణ పాఠశాలను నడిపించారు. గత పది రోజులుగా ఆయన అన్నాడీఎంకే తరుపున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం ఆయన గుండెపోటుకి గురి కావడంతో వెంటనే చెన్నైలని ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ రాత్రి తుదిశ్వాస విడిచారు.తమిళ నాట విలన్, క్యారెక్టర్ యాక్టర్ గా పలు చిత్రాల్లో నటించారు. అరుళ్మణి నటించిన చిత్రాలు.. అలకి, పొన్నుమణి, కరుపు రోజా, వేల్, తెనారల్, మదురమలై, కత్తు తమిళ్, వన యుద్దం, సింగం 2, లింగ, దాండవకోనే సహా 90 చిత్రాల్లో నటించారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వరుసగా ప్రముఖ రాజకీయ నేతలు, సినీ నటులు గుండెపోటుతో కన్నుమూయడం గమనార్హం.