iDreamPost
android-app
ios-app

షూటింగ్‌లో ప్రమాదం.. విశ్వక్ సేన్‌కు గాయాలు..!

ఇండస్ట్రీలో వచ్చిన ఆఫర్లను సద్వినియోగపర్చుకుంటూ కెరీర్ డెవలప్ చేసుకుంటున్నారు యంగ్ టాలెంట్స్. ఇప్పుడంతా యువ హీరోల హవానే నడుస్తోంది. తమను తాము నిరూపించుకునేందుకు ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటున్నారు.

ఇండస్ట్రీలో వచ్చిన ఆఫర్లను సద్వినియోగపర్చుకుంటూ కెరీర్ డెవలప్ చేసుకుంటున్నారు యంగ్ టాలెంట్స్. ఇప్పుడంతా యువ హీరోల హవానే నడుస్తోంది. తమను తాము నిరూపించుకునేందుకు ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటున్నారు.

షూటింగ్‌లో ప్రమాదం.. విశ్వక్ సేన్‌కు గాయాలు..!

సినిమా పరిశ్రమపై క్రేజ్‌తో ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు యంగ్ టాలెంట్స్. తమకంటూ మంచి పేరు తెచ్చుకోవాలని ఆరాటపడుతున్నారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకెళుతున్నారు. వచ్చిన రోల్ 100 పర్సంట్ న్యాయం చేయాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఒక్కొక్కసారి క్రిటికల్ స్టంట్స్, యాక్షన్ సన్నివేశాల్లో కూడా డూప్స్ లేకుండా వారే నటించి.. గాయపడ్డవారున్నారు. ప్రాణం మీదకు తెచ్చుకున్న నటులున్నారు. కొన్ని సార్లు ఊహించని ప్రమాదాలు వారిని ఆసుపత్రి పాలు చేస్తుంటాయి. మొన్నటి మొన్న టైగర్ నాగేశ్వరరావు షూటింగ్ సమయంలో రవితేజ గాయపడిన సంగతి విదితమే. తాజాగా టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్, మాస్ కా దాస్ గాయపడ్డారు.

టాలీవుడ్ ప్రముఖ నటుడు విశ్వక్ సేన్ గాయపడ్డారని సమాచారం. విశ్వక్ హీరోగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా తెరకెక్కుతోంది. కృష్ణ చైతన్య ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండగా.. సితార ఎంటర్ టైన్ మెంట్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ క్రమంలో యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ స్టంట్ కోసం విశ్వక్ రిహార్సల్స్ చేస్తుండగా.. గాయపడ్డారు. తోటి నటులు, ఫైటర్స్ తో కలిసి లారీ మీద స్టంట్ ప్రాక్టీస్ చేస్తుండగా.. స్లిప్ అయ్యి కింద పడ్డారట. దీంతో ఒక్కసారిగా షాకైన మూవీ యూనిట్.. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయన కాలికి గాయం అయినట్లు తెలుస్తోంది.

ఈ సంఘటన జరిగి కొన్ని రోజులు అయినప్పటికీ.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే కోలుకుని హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయినట్లు సమాచారం. గ్యాంగ్ ఆఫ్ గోదావరిలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నసంగతి విదితమే. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై హైప్ తెస్తున్నాయి. డిసెంబర్ 8న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.  ఈ సమయంలో ఆయన గాయపడటంతో ఆ మూవీ విడుదలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ సినిమాలో నాజర్, సాయికుమార్, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరీ అనుకున్న సమయానికే ఈ మూవీ విడుదలౌతుందో లేదో చూడాలి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş