iDreamPost
android-app
ios-app

Shane Warne: షేన్ వార్న్ బయోపిక్.. శృంగార సన్నివేశం చేస్తూ ఆస్పత్రిపాలైన నటుడు!

  • Author Soma Sekhar Published - 01:24 PM, Fri - 16 June 23
  • Author Soma Sekhar Published - 01:24 PM, Fri - 16 June 23
Shane Warne: షేన్ వార్న్ బయోపిక్.. శృంగార సన్నివేశం చేస్తూ ఆస్పత్రిపాలైన నటుడు!

సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ లకు ప్రత్యేకమైన స్థానం ఉంది. రాజకీయ నాయలకులు, క్రికెట్ దిగ్గజాల జీవిత చరిత్ర ఆధారంగా ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. తాజాగా ఓ దిగ్గజ బౌలర్ జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కబోతోంది. ఆ దిగ్గజ బౌలర్ మరెవరో కాదు.. ఆసిస్ స్పిన్ మాత్రికుడు షేన్ వార్న్. తన గుగ్లీతో ప్రపంచ బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించాడు వార్న్. అయితే గుండెపోటుతో వార్న్ హఠాన్మరణం చెందిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అతడి బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ టైమ్ లో అనుకోని సంఘటన జరిగింది. శృంగార సన్నివేశాన్ని షూట్ చేస్తున్న క్రమంలో లీడింగ్ నటీ, నటుడు ఆస్పత్రిపాలైయ్యారు.

ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ గతేడాది మరణించిన సంగతి తెలిసిందే. క్రికెట్ చరిత్రలో ఎంత గొప్ప పేరు సంపాదించాడో.. వ్యక్తిగత జీవితంలో అన్ని విమర్శలు ఎదుర్కొన్నాడు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. అయితే వరల్డ్ క్రికెట్ లో దిగ్గజ బౌలర్ గా పేరుగాంచిన వార్న్ జీవిత చరిత్రను ‘వార్నీ’ అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు. దాంతో క్రికెట్ అభిమానుల్లో ఎక్కడా లేని ఆసక్తి రేపింది. దానికి కారణం అతడు వివాదాలతో దోస్తీ చేయడమే.

ఇక వార్న్ బయోపిక్ లో ఆస్ట్రేలియా నటుడు అలెక్స్ విలియమ్స్ వార్న్ పాత్ర పోషిస్తుండగా.. అతడి భార్య సిమోన్ పాత్రలో మార్నీ కెన్నెడీ నటిస్తోంది. ఇక వార్నీ చిత్రం షూటింగ్ జరుపుకుంటున్న క్రమంలో ఓ అపశ్రుతి చోటుచేసుకుంది. షూటింగ్ లో భాగంగా.. శృంగార సన్నివేశం చేయబోయిన లీడ్ యాక్టర్స్ ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. అసలు విషయం ఏంటంటే? కథలో భాగంగా.. సె*క్స్ సీన్ లో నటించాల్సి వచ్చింది. అదికాస్త గాడి తప్పడంతో.. అలెక్స్ తలకు, కెన్నెడీ చేతికి గాయాలు అయ్యాయి.

ఈ ప్రమాదంపై కెన్నెడీ ఈ విధంగా స్పందించింది. “షేన్ వార్న్, సిమోన్ యుక్త వయసులో ఉన్నప్పుడు జరిగే సీన్ అది. మేం వరండాలో నడుస్తూ వెళ్తూ.. అక్కడి నుంచి పరిగెత్తుకు వచ్చి బెడ్ పై పడిపోవాలన్నది సీన్. అయితే మేము పరిగెత్తుకొచ్చి బెడ్ పై కాకుండా కింద పడ్డాం. దాంతో అలెక్స్ తలకు, నా మణికట్టుకు గాయాలు అయ్యాయి” అంటూ కెన్నెడీ చెప్పుకొచ్చింది. కాగా వార్న్ బయోపిక్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ఇంగ్లీష్ నటి లిజ్ హర్లీతో వార్న్ కు ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం. ఇక వార్నర్ తన మెుత్తం క్రికెట్ కెరీర్ లో 1000కి పైగా వికెట్లు తీసి చరిత్రకు ఎక్కాడు.

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet Girişcasibom girişHoliganbet GirişOnwin GirişRekabet girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel