iDreamPost
android-app
ios-app

చిక్కుల్లో స్టార్ హీరో కొడుకు సినిమా.. రిలీజ్ అవుతుందా? లేదా?

  • Published Jun 11, 2024 | 11:45 AM Updated Updated Jun 11, 2024 | 11:45 AM

రిలీజ్ సిద్ధమైన ఓ స్టార్ హీరో కొడుకు సినిమా చిక్కుల్లో పడింది. ఈ మూవీ కాంట్రవర్సికి దారితీయడంతో అనుకున్న టైమ్ కు రిలీజ్ అవుతుందా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ సినిమా ఏది? ఆ హీరో ఎవరు? పూర్తి వివరాల్లోకి వెళితే..

రిలీజ్ సిద్ధమైన ఓ స్టార్ హీరో కొడుకు సినిమా చిక్కుల్లో పడింది. ఈ మూవీ కాంట్రవర్సికి దారితీయడంతో అనుకున్న టైమ్ కు రిలీజ్ అవుతుందా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ సినిమా ఏది? ఆ హీరో ఎవరు? పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Jun 11, 2024 | 11:45 AMUpdated Jun 11, 2024 | 11:45 AM
చిక్కుల్లో స్టార్ హీరో కొడుకు సినిమా.. రిలీజ్ అవుతుందా? లేదా?

ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ అయ్యే వరకు ఎన్నో సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. అయితే ఈ కష్టాలను ఎదుర్కొనలేక కొన్ని సినిమాలు ల్యాబ్స్ లోనే మూలనపడి ఉంటాయి. ఇక మరికొన్ని మూవీలను కొన్ని చిక్కులు, వివాదాలు వెంటాడుతూ ఉంటాయి. దాంతో విడుదల అయ్యేందుకు నానా తంటాలు పడాల్సి వస్తుంది. ప్రస్తుతం ఓ స్టార్ హీరో కొడుకు సినిమా ఓటీటీ రిలీజ్ కు ఇలాంటి కష్టాలే వచ్చిపడ్డాయి. దాంతో ఆ మూవీ రిలీజ్ అవుతుందా? లేదా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఇంతకీ ఆ సినిమా ఏది? ఆ స్టార్ హీరో కొడుకు ఎవరు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ ‘మహారాజ్’ అనే డెబ్యూ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రం ఈనెల 14న ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ పది రోజుల క్రితమే ప్రకటించారు. విడుదలకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ ఇంత వరకు ప్రమోషన్స్ గానీ, ట్రైలర్ రిలీజ్ గానీ లేవు. మరెందుకు మేకర్స్ ఇంతలా భయపడుతున్నారు. అసలు విషయం ఏంటంటే? ఈ మూవీలో తమ మనోభావాలు దెబ్బతినే సన్నివేశాలు ఉన్నాయంటూ భజరంగ్ దళ్ కార్యకర్తలు వార్నింగ్ ఇచ్చారని, పైగా తమకు ముందుగా సినిమా చూపించిన తర్వాతే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారట. దాంతో మేకర్స్ అయోమయంలో పడ్డట్లు తెలుస్తోంది.

ఇంతకీ మహారాజ్ కథేంటి? భజరంగ్ దళ్ వారు వార్నింగ్ ఇచ్చేంత స్టోరీ ఉందా? ఇప్పుడు చూద్దాం. 1862లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మహారాజ్ లైబిల్ కేసు ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ సిద్ధార్థ్ పి మల్హోత్రా. ఈ చిత్రంలో మత విశ్వాసాలను అడ్డం పెట్టుకుని అమ్మాయిల జీవితాలతో ఆడుకునే కొందరి దుర్మార్గాలను ఇందులో చూపించారు. ఇక వారి ఆకృత్యాలను వెలికితీసే జర్నలిస్ట్ పాత్రలో జునైద్ కనిపించనున్నాడు. వల్లభాచార్య వర్గానికి చెందిన బ్రిజ్ రతన్ జీ మహారాజ్ గా జైదీప్ ఆహ్లావత్ కనిపిస్తారు. వీరిద్దరి మధ్య జరిగే పోరాటమే ఈ మహారాజ్ మూవీ స్టోరీ.

ఈ చిత్రంలో తమ మనోభావాలు కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని దాంతో తమకు చూపించిన తర్వాతే రిలీజ్ చేసుకోవాలని భజరంగ్ దళ్ మేకర్స్ తో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై మేకర్స్ ఇంకా ఎటూ తేల్చుకోనట్లు కనిపిస్తోంది. రిలీజ్ కు మూడు రోజులే టైమ్ ఉండటం, ట్రైలర్ రిలీజ్ చేయకపోవడం చూస్తుంటే.. దర్శక, నిర్మాతలు వారి డిమాండ్స్ కు భయపడి విడుదల వాయిదా వేస్తారా? లేదా సైలెంట్ గా స్ట్రీమింగ్ చేస్తారా? అన్నది వేచిచూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet