iDreamPost
android-app
ios-app

నాలుగేళ్ల బాలికపై అత్యాచారం .. పోక్సో యాక్ట్ కింద ‘దృశ్యం’ నటుడు అరెస్ట్?

  • Published Jun 11, 2024 | 8:59 AM Updated Updated Jun 11, 2024 | 8:59 AM

Drishyam Actor: దారుణ సంఘటన చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలికపై ప్రముఖ నటుడు ఒకరు అత్యాచారం చేశాడనే ఆరోపణల నేపథ్యంలో అతడిపై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఆ వివరాలు..

Drishyam Actor: దారుణ సంఘటన చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలికపై ప్రముఖ నటుడు ఒకరు అత్యాచారం చేశాడనే ఆరోపణల నేపథ్యంలో అతడిపై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఆ వివరాలు..

  • Published Jun 11, 2024 | 8:59 AMUpdated Jun 11, 2024 | 8:59 AM
నాలుగేళ్ల బాలికపై అత్యాచారం .. పోక్సో యాక్ట్ కింద ‘దృశ్యం’ నటుడు అరెస్ట్?

అత్యాచారం.. ఆడవారి జీవితాలను నాశనం చేసే రాక్షస చర్య. పశువుగా మారిన మృగాడు.. ఆడవారి జీవితాలను నాశనం చేయడానికి ఎంచుకునే మార్గం అత్యాచారం. దీని వల్ల వారి జీవితాలు ముగిసిపోతాయి. బతికున్న శవాలుగా మారతారు. అత్యాచారానికి పాల్పడే మృగాడు.. ఒక్క నిమిషం.. ఇదే పరిస్థితిలో తన కుటుంబంలోని మహిళలు ఉంటే వారి పరిస్థితి ఏంటి అని ఆలోచించగలిగితే… సమాజంలో చాలా వరకు దారుణాలు తగ్గిపోతాయి. కానీ పశువులా మారిన మృగాడికి ఇంతలా ఆలోచించే విచక్షణ ఉంటుందని అనుకోవడం ఎండమావిలో నీరు వెతకడం లాంటిదే. అత్యాచారాల నిరోధానికి ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. మృగాళ్లలో మాత్రం మార్పు రావడం లేదు. ఇలాంటి దారుణాలకు పాల్పడే వారిలో సామాన్యులు మాత్రమే కాక సెలబ్రిటీలు కూడా ఉండటం విషాదకరంగా మారింది. ఇక తాజాగా దృశ్యం నటుడు ఒకరు.. నాలుగేళ్ల బాలికపై దారుణానికి పాల్పడ్డాడని.. అతడిపై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారని తెలుస్తోంది. ఆ వివరాలు..

ఈ దారుణ సంఘటన కేరళలో చోటు చేసుకుంది. మలయాళ ‘దృశ్యం’తో పాటు పలు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్, విలన్‌ పాత్రల్లో నటించిన మలయాళ నటుడు కూటికల్ జయచంద్రన్.. నాలుగేళ్ల బాలికపై అత్యాచారం జరిపాడనే ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్‌ చేశారని టాక్‌. మలయాళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ఘటన జరిగిన రోజు కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లిన బాలిక చాలాసేపటి తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది.

అయితే బాలిక దుస్తులు కాస్త చిరిగిపోయి, శరీరం దుమ్ము కొట్టుకు పోయి ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు.. ఏమైందని ఆరా తీశారు. దాంతో నటుడు చేసిన నిర్వాకం వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల బాలికను వేధించాడంటూ చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు కోజికోడ్ స్టేషన్‌లో పోలీసులు నటుడిపై కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాల కారణం వల్లే.. జయచంద్రన్ తమ నాలుగేళ్ల కుమార్తెను చిత్రహింసలకు గురిచేశాడని బాలిక తల్లి ఫిర్యాదు చేసింది.

ఈ క్రమంలో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఆదేశాల మేరకు పోలీసులు చిన్నారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో నటుడు జోతుక్కల్ జయచంద్రన్‌ను పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేసి జైలులో పెట్టారని వార్తలు వస్తున్నాయి. ఈ సంఘటన సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. జయచంద్రను కఠినంగా శిక్షించాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ అంశం మీద జయచంద్రన్ ఇంకా స్పందించలేదు.. ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కాకపోతే పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారని.. నటుడిని ఇంకా అరెస్టు చేయలేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ఈ కేసులో మైనర్ ప్రమేయం ఉన్నందున మరింత సమాచారం వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇక జయచంద్రన్ మిమిక్రీ ఆర్టిస్ట్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. తర్వాత జగతి వర్సెస్ జగతి అలాగే కామెడీ టైమ్ వంటి కార్యక్రమాలతో యాంకర్‌గా ఎదిగారు. ఇక ఆయన దృశ్యంలో కీలక పాత్ర పోషించాడుదానితో పాటు, న్జాన్, ఒరు సెకండ్ క్లాస్ యాత్ర, లక్ష్యం, నారధన్, మై బాస్, డిటెక్టివ్ వంటి అనేక హిట్ సినిమాల్లో కూడా నటించాడు జయచంద్రన్‌.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi giriş