iDreamPost
android-app
ios-app

‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సీక్వెల్! త్రిష, డైరెక్టర్ ఏమన్నారంటే..

  • Author ajaykrishna Updated - 01:13 PM, Mon - 11 September 23
  • Author ajaykrishna Updated - 01:13 PM, Mon - 11 September 23
‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సీక్వెల్! త్రిష, డైరెక్టర్ ఏమన్నారంటే..

ఇండస్ట్రీలో సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా హిట్ అవుతున్న సినిమాలకే కాదు.. ఎప్పుడో గతంలో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమాలకు కూడా సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఆల్రెడీ 18 ఏళ్ళ క్రితం బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘బృందావన కాలనీ’ మూవీకి సీక్వెల్ ప్లానింగ్ జరుగుతుంది. ఇప్పుడు అదే బృందావన కాలనీ సినిమా దర్శకుడు మరో బ్లాక్ బస్టర్ సీక్వెల్ కి తెరలేపాడు. దర్శకుడు సెల్వరాఘవన్ అలియాస్ శ్రీ రాఘవ సినిమాలకు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2002 నుండి 2010 వరకు ఆయన తీసిన ప్రతీ సినిమాకు ఓ స్పెషల్ మార్క్ సెట్ అయ్యింది.

ఆ తర్వాత నుండి ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం సెల్వ రాఘవన్ స్ట్రగుల్ అవుతున్నాడు. అయితే.. 2007లో వెంకటేష్, త్రిష జంటగా సెల్వ తీసిన సూపర్ హిట్ మూవీ ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. సినిమా కథాకథనాలతో పాటు సాంగ్స్, ఎమోషన్స్ అన్ని ఇప్పటికి ప్రేక్షకులకు ఫేవరేట్ గా నిలిచాయి. ఈ సినిమా కూడా ఇప్పుడు సీక్వెల్ లిస్ట్ లో చేరుతుందని టాక్. ఎందుకంటే.. పదేళ్లు క్రితం సెల్వ చేసిన ట్వీట్ కి హీరోయిన్ త్రిష తాజాగా రిప్లై ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఇంతకీ సెల్వ ఏమని ట్వీట్ చేశాడంటే.. “ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా చూశాను. వెంకటేష్, త్రిషలతో వర్క్ చేయడం గొప్ప అనుభవం. ఈ సినిమాకు సీక్వెల్ తీయడంలో నాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు” అని 2013లో పేర్కొన్నాడు. డైరెక్టర్ ట్వీట్ కి ఇప్పుడు త్రిష రిప్లై ఇస్తూ.. “నేను రెడీ” అని రాసుకొచ్చింది. దీంతో ఇప్పుడు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే మూవీకి సీక్వెల్ పై ఆసక్తి దర్శకుడికే కాదు.. హీరోయిన్ కి కూడా ఉందని అర్ధమవుతుంది. సినిమా వచ్చిన పదహారేళ్లకు త్రిష సీక్వెల్ గురించి తన మనసులో మాట బయట పెట్టడం ఫ్యాన్స్ లో ఆసక్తి రేపుతోంది. సరే ఇప్పుడీ సినిమా సీక్వెల్ కి ముందునుండి డైరెక్టర్ రెడీ, ఇప్పుడు త్రిష రెడీ.. ఇక వెంకీమామ సంగతేంటో అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఈ సినిమాకి సీక్వెల్ వస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.